కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు పరిక్షలు వాయిదా పడుతుంటే.. కొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే CBSC బోర్డు 10th పరీక్షలను క్యాన్సిల్ చేసి.. 12th పరీక్షలని వాయిదా వేసింది. తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర లలో 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి.. ఇంటర్ పరీక్షలని వాయిదా వేశారు. రీసెంట్ గా తెలంగాణాలో 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేసి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ని వాయిదా వేసింది టీఎస్ గవర్నమెంట్. ఇక ఆంధ్ర లో ఇప్పటికి స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ చేసి విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.
ఏపీలో విద్యాసంస్థలు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. అయినా జగన్ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లుగా కూడా లేదు అంటూ ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం విద్యాసంస్థల మూసి వేతకు ఒప్పుకోవడం లేదు. అయితే తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీలో కరోనా కారణముగా 1 నుండి 9 వతరగతి విద్యార్థులకు హాలిడేస్ ప్రకటించారు. అలాగే 10th, ఇంటర్ ఎగ్జామ్స్ యధాతధంగా అనుకున్న షెడ్యూల్ కే జరుగుతాయని స్పష్టం చేసారు. కరోనా నిభందనలు పాటిస్తూ 10th, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం అని మంత్రి ప్రకటించారు.