ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రావాల్సిన NTR30 పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుంది అనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ నుండి త్రివిక్రమ్ తప్పుకోగా.. దర్శకుడు కొరటాల ఆ ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు కొరటాల కూడా ఎన్టీఆర్ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నాడనే టాక్ మొదలయ్యింది. గతంలో కొరటాల శివ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేసాడు. ఆ సినిమాలో మహేష్ సీఎం గా సమాజాన్ని ఉద్ధరించే నాయకుడిగా స్టైలిష్ గా అదరగొట్టేసాడు.
ఇప్పుడు ఒక సామాన్య యువకుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే పొలిటికల్ గా అతను సమాజానికి ఎలాంటి న్యాయం చేసాడు. ఓ సామాన్యుడు తలుచుకుంటే పాలిటిక్స్ లోకి వచ్చి ఏమేం చెయ్యగలడో ఈ సినిమాలో చూపించబోతున్నాడట. ఎమోషనల్ గా బలమైన డైలాగ్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ఎమోషన్స్, పాలిటిక్స్ ఇవే సినిమాకి హైలెట్ అవుతాయట. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది అని, పాన్ ఇండియా లెవల్లో కొరటాల ఎన్టీఆర్ కోసం విలన్ ని సిద్ధం చేయబోతున్నట్లుగా టాక్.