Advertisement
Google Ads BL

ఇంత జరుగుతున్నా.. బన్నీ స్పందనేది


అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో బిజీగా వున్నాడు. సుకుమార్ తో కలిసి బన్నీ పుష్ప ని ఆగష్టు 13 న రిలీజ్ చేసాక కొరటాలతో నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్-కొరటాల ప్రాజెక్ట్ వాయిదా పడింది. కొరటాల ఎన్టీఆర్ తో వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ హిట్ కొట్టి కూర్చున్నాడు. దిల్ రాజు వకీల్ సాబ్ సక్సెస్ లో జోష్ లో ఉన్నాడు. సక్సెస్ ఊపులో వేణు శ్రీరామ్-దిల్ రాజులు బన్నీ తో ఐకాన్ ప్రాజెక్ట్ చేసే విషయంలో క్లారిటీగా ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో బన్నీ కి వకీల్ సాబ్ హిట్ కనిపిస్తుందిగా.. వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేయొచ్చుగా అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement
CJ Advs

అన్నిటిలో కాలిక్యులేటెడ్ గా ఉండే నిర్మాత దిల్ రాజు ఐకాన్ ప్రాజెక్ట్ పై నమ్మకంగా ఉన్నాడు. ఇంత జరుగుతున్నా అల్లు అర్జున్ ఐకాన్ ప్రాజెక్ట్ పై స్పష్టతనివ్వడం లేదు. దిల్ రాజు, వేణు శ్రీరామ్ లు ఐకాన్ ప్రాజెక్ట్ విషయంగా అంతలా పబ్లిక్ గా మాట్లాడుతున్నా  అల్లు అర్జున్ ఇంకా సైలెన్స్ నే మెయింటింగ్ చేస్తున్నాడు. ఎక్కడా ఐకాన్ మేటర్ ఎత్తడం లేదు. మరోపక్క ఐకాన్ స్టార్ గా మారిపోయి.. అందరితో ఐకాన్ స్టార్ గా పిలిపించుకుంటున్నాడు. మరి అంత చేస్తున్నా, అంత జరుగుతూన్న ఐకాన్ మూవీ పై అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడు.

Allu Arjun Icon is not dropped, will begin soon:

Allu Arjun Icon not shelved, says producer Dil Raju
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs