కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుండి స్టిల్ ఇప్పటివరకు మూతికి, ముక్కుకి మాస్క్ అనేది కంపల్సరీ అయ్యింది. మాస్క్ తీసి గాలి పీలిస్తే.. కరోనా కి అడ్డంగా దొరికిపోయినట్లే. అంతేకాదు.. కరోనా కారణంగా ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. మాములుగా వెకేషన్స్ కి జాలి ట్రిప్స్ కి వెళ్ళేవాళ్ళని కరోనా బాగా ఇబ్బందులు పెట్టేస్తుంది. లాక్ డౌన్ ముగియగానే టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాక సెలెబ్రెటీస్ అంతా పొలోమంటూ మాల్దీవులకు క్యూ కట్టారు. అయితే మాస్క్ మాత్రం ఉండాల్సిందే. ఇక ఈ ఏడాది సెకండ్ వెవ్ కారణంగా సినిమా షూటింగ్ లో మాస్క్ లు, శానిటైజేర్స్ ఇవన్నీ లెక్కకి మించి కనిపిస్తున్నాయి. ఎంజాయ్ చెయ్యడం అటుంచి కరోనా కి ఎక్కడ దొరికిపోతామో అనే భయం వెంటాడుతుంది. కరోనా కారణంగా ఒకప్పుటిలా ఎంజాయ్ చేస్తూ ఉండలేకపోతున్నామని ఓ అగ్రతార తెగ ఫీలైపోతుంది.
ఆమె టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్న పూజ హెగ్డే. కరోనా కారణంగా జీవన మనుగడకి ముప్పు వాటిల్లింది అని.. ఇదివరకటిలా ఎక్కడికి బడితే అక్కడికి వెళ్లలేకపోతున్నామని, అన్ని జాగ్రత్తలతో షూటింగ్ స్పాట్ కి వెళ్లాల్సి వస్తుంది అని, ప్రస్తుతం వెకేషన్స్ ని ఎంజాయ్ చెయ్యలేకపోతున్నామంటూ గతంలో తాను విహార యాత్రకి వెళ్లిన ఫోటో ని పోస్ట్ చేసింది. ఆ పిక్ తో పాటుగా మాస్క్ లేకుండా స్వేచ్ఛగా తిరిగే రోజులు మళ్ళీ ఎపుడు వస్తాయో అంటూ రాసుకొచ్చింది పూజ హెగ్డే. రీసెంట్ గ తన తండ్రి బర్త్ డే ని ఇంట్లోనే సెలెబ్రేట్ చేసుకున్న పూజ ఇలా ఫీలవుతుంది. అంటే పాపం మాస్క్ గట్రా లేకుండా, వెకేషన్స్ కి వెళ్లకుండా ఇలా బందిలా బతకడం పూజ కి చాలా కష్టంగా ఉందనిపిస్తుంది. పూజ కే కాదు అందరికి అలానే ఉంది.