Advertisement
Google Ads BL

విజయ్ కన్నా ముందు చరణ్ తో


గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కాంబినేషన్స్ మారిపోతున్న విషయం తెలిసిందే.. రేపో మాపో సినిమా సెట్స్ మీదకెళుతుంది అనుకున్న టైం కి ఆ కాంబినేషన్ కాస్తా మారిపోయి దర్శకులు, హీరోలు చేంజ్ అయ్యిపోతున్నారు. అలాగే విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబో కూడా మారిపోయినట్లుగా సోషల్ మీడియాలో ఓ రూమర్ బయలు దేరింది. పుష్ప పాన్ ఇండియా ఫిలిం తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ తో మూవీ అనౌన్స్ చేసాడు. విజయ్ దేవరకొండ కూడా పూరి దర్శకత్వంలో చేస్తున్న లైగర్ మూవీ ఫినిష్ కాగానే సుకుమార్ తో సినిమాకి రెడీ అవ్వాల్సి ఉంది. పుష్ప ఆగష్టు 13 న, దేవరకొండ లైగర్ సెప్టెంబర్ 17 న రిలీజ్ అవుతున్నాయి. మరి సుకుమార్ - విజయ్ లు ఒకేసారి ఫ్రీ అవుతారు కాబట్టి.. వీరి సినిమా దసరా నుండి మొదలవుతుంది అనుకుంటే.. కాదు వీరి కాంబో ఆగిపోయింది అనే న్యూస్ మొదలైంది.

Advertisement
CJ Advs

రీసెంట్ గా సుకుమార్ పుష్ప తర్వాత నా నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండ తో కాదు.. రామ్ చరణ్ తో ఉంటుంది, అయితే విజయ్ దేవరకొండతో నా మూవీ ఆగలేదు. అది కూడా ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. రంగస్థలం తర్వాత చరణ్ -సుకుమార్ కాంబో అంటే అది మాములు సినిమా అయ్యుండదు.. ఆ సినిమాపై మాములు అంచనాలుండవు అంటూ మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ విజయ్ దేవరకొండతో మూవీ చెయ్యాల్సిన సుకుమార్ ఇలా రామ్ చరణ్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యాడో చెప్పలేదు. అయితే సుకుమార్ - రామ్ చరణ్ తో చెయ్యబోయే మూవీ పూర్తి స్టైలిష్ ఎంటర్టైనర్ గా ఉంటుంది అని చెబుతున్నారు, మరి సుకుమార్ ఇలా హ్యాండ్ ఇస్తే.. విజయ్ లైగర్ తర్వాత తన తదుపరి మూవీ ఎవరికి చేస్తాడో చూడాలి.

Sukumar condemns the rumors about Vijay Devarakonda movie:

Sukumar condemns the rumors about Vijay Devarakonda movie and its after Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs