రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్, ఆచార్య మూవీస్ తర్వాత ఎలాంటి దర్శకుడిని ఎన్నుకుంటాడో.. ఎలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీ చేస్తాడో అంటూ చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. లోకేష్ కనకరాజ్, గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకులుగా వాళ్ళ పేర్లు చక్కర్లు కొట్టాయి. కానీ దిల్ రాజు రామ్ చరణ్ -శంకర్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం సెట్ చేసాడు. దిల్ రాజు చెన్నై లో కూర్చుని శంకర్ తో మాట్లాడి రామ్ చరణ్ RC15 ని శంకర్ - రామ్ చరణ్ కాంబో ప్రకటన ఇప్పించాడు.
అయితే రామ్ చరణ్ సెలెక్ట్ చేసుకున్న ఇండియన్ మోస్ట్ అవైటెడ్ దర్శకుడు శంకర్ అనగానే ఆ కాంబోపై అంచనాలు మొదలైపోయాయి. లోకల్ దర్శకులు కాకుండా చరణ్ ఇలాంటి ఓ డైరెక్టర్ తో మూవీ కమిట్ అవడంతో మెగా ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు శంకర్ పరిస్థితి చూసాక రామ్ చరణ్ సెలెక్షన్స్ రాంగ్ అనిపిస్తుంది అంటూ మెగా ఫాన్స్ మొత్తుకుంటున్నారు. చరణ్ తో సినిమా అనగానే ఇండియన్ 2 నిర్మాతలు శంకర్ పై కేసు వేశారు. ఇప్పుడు ఇండియన్ మూవీ జూన్ నుండి షూటింగ్స్ చెయ్యక తప్పేలా లేదు. దానితో చరణ్ మూవీ పట్టాలెక్కడానికి టైం పడుతుంది.
మరోపక్క రన్వీర్ సింగ్ తో ప్రకటించిన అపరిచితుడు మూవీ విషయంలోనూ శంకర్ ఆ సినిమా నిర్మాత తో ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నాడు. ఇన్ని వివాదాల నడుమ శంకర్ తో చరణ్ సినిమా సజావుగా సాగుతుందా? అసలు చరణ్ డెసిషన్ కరెక్ట్ నా? అంటూ మెగా ఫాన్స్ తికమకపడుతున్నారు. అయితే వివాదాల జోలికి వెళ్లకుండా తన ప్రాజెక్ట్ ని సజావుగా ముందుకు తీసుకెళ్లగల నిర్మాత దిల్ రాజు ఉండగా.. చరణ్ ప్రాజెక్ట్ విషయంలో బెంగపడక్కర్లేదు అని మెగా ఫాన్స్ సమాధానపడుతున్నా.. ఎక్కడో ఏదో ఓ మూల వాళ్ళు భయపడుతున్నారు.