అఫీషియల్ ప్రకటన వచ్చిన తర్వాత ఉన్నట్టుండి కాంబినేషన్స్ మారిపోతున్నాయి. ఆ మధ్యన సుకుమార్ - మహేష్, పూరి - మహేష్ ఇలా వరసగా కాంబినేషన్స్ మారిపోయి.. ఎవరికీ వారే వేరే వేరే కమిట్మెంట్స్ తో ముందుకెళుతున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్30 విషయంలోనూ ఉన్నట్టుండి త్రివిక్రమ్ ప్లేస్ లోకి కొరటాల వచ్చేసినట్లుగా.. ఇప్పుడు సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబో కూడా మారబోతుంది అనే టాక్ మొదలైంది. లైగర్ తర్వాత విజయ్ సుకుమార్ తో మూవీకి కమిట్ అయ్యి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు. పుష్ప పాన్ ఇండియా తర్వాత సుక్కు విజయ్ దేవరకొండ సినిమానే చెయ్యాలి.
తాజాగా సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబో కూడా పట్టాలు తప్పినట్లుగా టాక్. పుష్ప తర్వాత సుకుమార్ కి భారీ గ్యాప్ తప్పదని.. అటు రామ్ చరణ్ ని కానీ, ఇటు ఎన్టీఆర్ ని కానీ డైరెక్ట్ చెయ్యొచ్చనే ఊహాగానాలు ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. కారణాలు ఏవైనా కాంబినేషన్స్ చకచకా మారిపోతున్నట్టుగా ఇప్పుడు దేవరకొండ - సుక్కు ప్రాజెక్ట్ కూడా ఆగిందా? లేదంటే మారుతుందా? అనే అనుమానం అందరిలో మొదలైంది. చూద్దాం ఏం జరుగుతుందో.