కరోనాకి తనమన బేధం లేదు. సెలబ్రిటీస్ లేదూ.. సామాన్య మానవుడు లేదూ.. మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే అందరికి వచ్చేస్తుంది. బాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి.. పొలిటికల్ లీడర్స్, సీఎం లు, మాజీ సీఎం లు, టాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న జనసేన పవన్ కళ్యాణ్ కరోనా పాజిటివ్ తో బ్రీతింగ్ సమస్యతో ఆక్సిజెన్ పెట్టించుకుని ఉన్న పిక్ సోషల్ మీడియాని ఊపేసింది. గెట్ వెల్ సూన్ పవన్ కళ్యాణ్ అంటూ సెలబ్రిటీస్, ఫాన్స్ అందరూ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. మరోపక్క కరోనా టీకా వేయించుకున్న ఒక్క రోజులోనే హార్ట్ ఎటాక్ తో తమిళ కమెడియన్ వివేక్ మృతి చెందడం అందరిని కలిచివేసింది.
ఇక గత ఏడాది కరోనా లాక్ డౌన్ టైం లో చాలామందికి సేవలందించి, అనేకమందిని ఆదుకుని కరోనా హీరోగా పిలిపించుకున్న సోను సూద్ కి కరోనా సోకడం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేసింది. సోను సూద్ సినిమాల్లో విలన్ అయినా.. నిజ జీవితంలో అనేకమంది పేదలని ఆదుకుని రియల్ హీరోగా నిలిచాడు. ఇప్పుడు అదే సోను సూద్ కి కరోనా సోకడం ఆయన అభిమానులని టెక్షన్ కి గురి చేసింది. సోను సూద్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు దేవుడికి ప్రార్ధనలు చేస్తున్నారు.