ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు శంకర్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో శంకర్ బాగానే ఇరుక్కుపోయారు. ఇండియన్ 2 విషయంలో లైకా నిర్మాతలు కోర్టుకెళ్లగా.. దాన్ని సెటిల్ చేసే క్రమంలో ఉన్న శంకర్ తర్వాత రామ్ చరణ్ మూవీ చెయ్యాల్సి ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ ఏర్పాట్లు మొదలు పెట్టగా.. అది ఆదిలోనే హంసపాదు అన్నట్టు అపరిచితుడు నిర్మాత రవిచంద్రన్ శంకర్ కి లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
ప్రస్తతం శంకర్ కూడా ఆ కథ నాది అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో ఆస్కార్ రవిచంద్రన్ కోర్టులో తేల్చుకుందామంటూ సవాల్ చేస్తున్నాడు. ఇంకా ఆ మేటర్ అలా నడుస్తుండగానే శంకర్ తాను రన్వీర్ సింగ్ తో రీమేక్ చెయ్యబోయే మూవీ కోసం హీరోయిన్ ని ఫైనల్ చేసేసాడట, బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్న గ్లామర్ గర్ల్ కియారా అద్వానీని హీరోయిన్ గా అపరిచితుడు రీమేక్ కోసం శంకర్ ఎంపిక చెయ్యడమే కాదు.. దానికి సంబందించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తి చేసేసాడట.
మరి రామ్ చరణ్ తో చెయ్యబోయే సినిమాలో హీరోయిన్ గా కియారా పేరు బయటికి వచ్చినా ప్రస్తుతం ఆ ప్లేస్ లో రష్మిక పేరు వినిపిస్తుండగా.. ఇప్పుడు అదే శంకర్ రన్వీర్ సింగ్ తో చెయ్యబోయే సినిమా కోసం కియారని సెట్ చేసేసాడు. మరి ఓ వైపు ఆ కథ వివాదం ఇంకా సద్దుమణక్కుండానే .. ఇక్కడ హీరోయిన్ ఎంపిక పూర్తి కావడం కాస్త షాక్ ఇచ్చే విషయమే.