Advertisement
Google Ads BL

గొప్పలు పోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్


బిగ్ బాస్ లో అఖిలే నెంబర్ వన్ అని అనుకున్న అఖిల్ సార్థక్ చివరికి రన్నర్ అప్ గా బయటికి రావాల్సి వచ్చింది. అభిజిత్ - అఖిల్ మధ్యన మోనాల్ చిచ్చు పెట్టింది. మోనాల్ కోసం అఖిల్ అభిజిత్ తో గొడవలు పడేవాడు. ఇక బిగ్ బాస్ లో మోనాల్ తో స్నేహం చేసి.. సం థిన్ సం థింగ్ అనే రూమర్ పుట్టడంతో అఖిల్ కి ఆ క్రేజ్ బాగా కలిసొచ్చింది. మోనాల్ తో సం థింగ్ రూమర్ బాగా పాపులర్ అయ్యి అఖిల్ బయట ఫెమస్ అయ్యాడు. అటు చూస్తే మోనాల్ కూడా గ్లామర్ తో సినిమాలు, డాన్స్ ప్లస్ షో తో బిజీ అయ్యింది. అయితే మొన్నామధ్యన మోనాల్ తో కలిసి ఆంధ్ర అబ్బాయి - గుజరాతీ అమ్మాయి అంటూ వెబ్ సీరీస్ మొదలు పెట్టిన అఖిల్ సార్థక్ రీసెంట్ గా ఫస్ట్ టైం అనే మూవీ మొదలు పెట్టాడు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా పూజ కార్యక్రమాలతో మొదలైన అఖిల్ కొత్త సినిమా ఓపెనింగ్ తర్వాత ఓ ఇంటర్వ్యూ లో ఎంతగా గొప్పలు పోయాడంటే.. తనకి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయని, తన దగ్గరికి 26 సినిమా కథలు వచ్చాయని కానీ అవేమి తనకి నచ్చక రిజెక్ట్ చేసి.. ఈ ఫస్ట్ టైం సినిమా ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఫస్ట్ టైం సినిమా కథ తనకి బాగా నచ్చింది అని.. కాబట్టే ఈ సినిమా ఒప్పుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. మరి ఏడెనిమిది కథలు రిజెక్ట్ చేశాను అంటే నిజమనిపించేది.. కానీ ఏకంగా 26 కథల తర్వాత ఈ ఫస్ట్ టైం కథ మాత్రమే నచ్చింది అంటే.. వినడానికి గొప్పలులా కాకుండా మరెలా ఉంటుంది అంటూ అభిజిత్ ఫాన్స్ దగ్గరనుండి మిగతా నెటిజెన్స్ కూడా అంటున్న మాట.

Shocking Claim By Akhil:

I Was rejected 26 stories says Bigg Boss Akhil
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs