Advertisement
Google Ads BL

ఇండియా 2 పై శంకర్ మెలిక


కమల్ హాసన్ హీరోగా భరతీయుడు సినిమాకి సీక్వెల్ గా మొదలైన ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఆ సినిమా సెట్స్ లో జరిగిన క్రేన్ ప్రమాదం కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి ఆ సినిమా షూటింగ్ అప్ డేట్ లేదు. కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 ప్రాజెక్ట్ ని పక్కన బెట్టి.. ఇటు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తోనూ, అటు బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ తోనూ మూవీస్ ని సెట్ చేసుకున్నారు. రామ్ చరణ్ RC15 పాన్ ఇండియా ఫిలిం ఈ ఏడాది ఆగష్టు నుండి మొదలు కావల్సి ఉండగా.. ఇండియన్ 2 నిర్మాతలు భారతీయుడు 2 మూవీ కంప్లీట్ చేసి శంకర్ ని మిగతా ప్రాజెక్ట్స్ చేసుకోమని కోర్టుకు వెళ్లారు. రణ్వీర్ సింగ్ తో చెయ్యబోయే అపరిచితుడు మూవీ రీమేక్ కూడా ఒరిజినల్ నిర్మాత లీగల్ నోటీసు ఇవ్వడంతో ఇప్పుడా ప్రాజెక్ట్ డైలమాలో ఉంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా లైకా ప్రొడక్షన్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ పై వేసిన కేసు విషయంగా చెన్నై కోర్టులో వాద ప్ర‌తివాద‌న‌లు జరిగాయి. అయితే శంకర్ తరుపు న్యాయవాది  ఇండియన్ 2 సినిమా ఆగలేదని, ఆ సినిమాకి సంబందించిన విదేశీ ఫైటర్స్ కరోనా కారణంగా రాలేకపోవడంతో ఆలస్యమైంది అని, కోవిడ్ భ‌యాల‌తో.. వాళ్లు ఇండియాలో అడుగుపెట్ట‌డానికి భ‌య‌పెడుతున్నార‌ని అందుకే షూటింగ్ కి బ్రేకులు పడ్డాయని, ఇక కమల్ హాసన్ కూడా జూన్ నుండి డేట్స్ ఇస్తే వెంటనే ఇండియన్ 2 ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతుంది అని శంకర్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించడంతో.. ఇండియన్ 2 జూన్ నుండి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి లైకా వారు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

Indian 2 shooting resumed in June:

Shankar says Bharateeyudu-2 will be started soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs