బుల్లితెర మీద ఫెస్టివల్ స్పెషల్స్, కామెడీ షోస్ కి గొంతు చించుకుని అరిచి మాట్లాడే శ్రీముఖి.. ఈ మధ్యన సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో తెగ రెచ్చిపోతుంది. అనసూయ కి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటుందో ఏమో కానీ.. క్లివేజ్ షోస్, గ్లామర్ షూట్, ప్యాంట్ లెస్ షూట్, గోవాలో ఫ్రెండ్స్ తో శ్రీముఖి అల్లరి అబ్బో ఈ మధ్యన శ్రీముఖి మాములుగా హైలెట్ అవ్వడం లేదు. ఇదంతా ఏ హీరోయిన్ అవకాశాలు కోసమోలే అని సరిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు శ్రీముఖి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో బిగ్ బాస్ షో లో తాను ఒకరి ప్రేమలో పడి మోసపోయాను అంటూ చెప్పిన శ్రీముఖి.. మళ్ళీ ఇంతవరకు ప్రేమలో పడినట్లుగా చెప్పకపోయినా.. శ్రీముఖి ముంబై సినిమా ఫీల్డ్ తో సంబంధం ఉన్న వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా.. అతనినే శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇంకొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం నడుపుదామన్నా ఆమె పేరెంట్స్ ఆమెని పెళ్లి చేసుకోమనంటూ బలవంత పెట్టేస్తున్నారట. పెళ్లి చేసుకున్నాక కూడా కెరీర్ ఎక్కడికి పోదు.. పెళ్లయ్యాక సుమ, అనసూయ అద్భుతంగా దూసుకుపోవడం లేదా అని నచ్చచెప్పడంతో శ్రీముఖి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. ఇప్పటికే పలు షోస్ లో తన పెళ్లి విషయంగా కీ ఇస్తున్న శ్రీముఖి పెళ్లి త్వరలోనే ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది.