Advertisement
Google Ads BL

నమ్మలేకపోతున్న బుల్లితెర ప్రేక్షకులు


బుల్లితెర మీద క్రేజీ సీరియల్ ఏదయ్యా అంటే స్టార్ మా లో రాత్రి 7.30 నిమిషాలకు ప్రసారం అవుతున్న వంటలక్క అదేనండి కార్తీక దీపం సీరియల్. కార్తీక దీపం సీరియల్ కున్న క్రేజ్ బ్లాక్ బస్టర్ సినిమాని బుల్లితెర మీద ప్రదర్శించినా రావడం లేదు. అంతగా బుల్లితెర ప్రేక్షకులు కార్తీక దీపం సీరియల్ కి పట్టం కడుతున్నారు. బిగ్ బాస్ బాస్ కానివ్వండి ఏ స్పెషల్ ప్రోగ్రాం కూడా కార్తీక దీపం సీరియల్ టీఆర్పీ ని క్రాస్ చెయ్యలేకపోయింది అంటే.. దానికి ఉన్న క్రేజ్ అర్ధమైపోతుంది. డాక్టర్ బాబు గా నిరుపమ్, వంటలక్క దీపగా ప్రేమి విశ్వనాధ్ ల నటనకు, ఆ సీరియల్ కి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా. అందుకే విషయం లేకుండా ఏళ్ళ తరబడి సాగుతున్న ఆ సీరియల్ ని ఆదరిస్తున్నారు.. అందలం ఎక్కిస్తున్నారు.

Advertisement
CJ Advs

డాక్టర్ బాబు కార్తీక్ వంటలక్క దీప ని అనుమానంతో వదిలేసినా, పిల్లలని పెంచుకుంటూ దేశోద్ధారకుడిగా ఉంటున్న కార్తీక్.. ఎట్టకేలకు పదేళ్లకు భార్య దీపతో కలిసిపోయినట్టుగా గత రెండు రోజులుగా సీరియల్ లో చూపిస్తున్నారు. మరి దీప ఆరోగ్యం రీత్యా డాక్టర్ బాబు దీపతో కలిసిపోయాడా? లేదంటే మనస్ఫూర్తిగా దీపని అక్కున చేర్చుకున్నాడా? ఒకవేళ కలిసిపోతే విలన్ మోనిత ఊరుకుంటుందా? అసలు దీప బ్రతుకుతుందా? చనిపోతుందా? నిజంగా కార్తీక్ - దీప ఒకకటయ్యారా.. అస్సలు నమ్మబుద్దికావడం లేదు అంటూ రకరకాల అనుమానాలు ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మీద సినిమా సెలబ్రిటీస్ దగ్గర నుండి.. సామాన్య ప్రేక్షకుడు వరకు తెగ ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు.

Karthika Deepam Serial Public Talk:

Karthika Deepam Serial Public Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs