Advertisement
Google Ads BL

ఏముందిరా జంట


నాగ చైతన్య - సమంత చూడ చక్కని జంట. ఐదేళ్లు ప్రేమ పక్షుల్లా విహరించి.. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న ఈ జంట.. కెరీర్ లో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. పెళ్ళికి ముందు.. పెళ్లి తర్వాత కలిసి సినిమాల్లో నటించడమే కాదు.. ఈ జంట పలు యాడ్స్ లో కలిసి నటించింది. ఇప్పటికి చైతూ - సమంత కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ క్రేజే వేరు. మజిలీ సినిమా తో ఆ క్రేజ్ ని రిపీట్ చేసిన నాగ చైతన్య - సమంత లు రానా పెళ్లి లో చిలిపి గా ఫోటో లకి ఫోజులిచ్చారు. అయితే తాజాగా చైతు - సమంత ల ఫోటో షూట్ ఒకటి బయటికి వచ్చింది.

Advertisement
CJ Advs

అందమైన చీర కట్టులో అందంగా ముస్తాబైన సమంత, లాల్చీ పైజామాలో నాగ చైతన్యలు ఏదో యాడ్ షూట్ కోసం ఫోటో షూట్ చేసినట్టుగా కనిపిస్తున్నారు. ఆ జంటని అలా ఫొటోస్ లో చూస్తుంటే.. ఎంత ముచ్చటగా ఉంది ఈ జంట అనేస్తారు. సమంత అందమైన కంచి పట్టు చీరలో.. మేడలో బంగారు ఆభరణాలతో.. తలకి కొప్పు పెట్టుకుని.. కొప్పుని పూల తో కవర్ చేస్తూ.. చెవులకి బుట్టలు పెట్టుకుని భర్త నాగ చైతన్య తో కలిసి ఫోటో షూట్ లో పాల్గొంది. వాళ్ళు ఏ బట్టల షాప్ ని ప్రమోట్ చేసేందుకో.. లేదంటే మరేదన్నా విషయంగానో ఈ ఫోటో షూట్ చేయించుకున్నారో కానీ.. ఇలా చైతు- సమంత లని ట్రెడిషనల్ వేర్ లో చూస్తుంటే నిజంగా ఏముందిరా ఈ జంట అనేస్తారు.

Naga Chaitanya - Samantha Special photos going viral :

Cute moments between Sam and Chay
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs