Advertisement
Google Ads BL

అఖండ: తండ్రి కొడుకులుగా బాలయ్య


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో పవర్ ఫుల్ మాస్ ఎంటెర్టైనెర్ గా రాబోతున్న BB3 అఖండ మూవీ టీజర్ యూట్యూబ్ రికార్డులని వేటాడుతుంది. అఖండ గా అఘోర గా బాలయ్య మాస్ లుక్ కి నందమూరి ఫాన్స్ ఏమిటి మాస్ ఫాన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు. బోయపాటి డైరెక్షన్ మొదలు పెట్టింది.. బాలయ్య ని ఇంత మాస్ గా చూపిస్తూ సినిమాలు చెయ్యడానికే అన్నట్టుగా వారి కాంబో మూవీస్ ఉంటున్నాయి. సింహ లో తండ్రి కొడుకులుగా అద్భుతమైన మాస్ పెరఫార్మన్స్ ఇచ్చిన బాలకృష్ణ, అదే బోయపాటి దర్శకత్వంలో లెజెండ్ మూవీలో అన్నదమ్ములుగా బాలయ్య డ్యూయెల్ రోల్ చేసాడు. మాస్ ప్రేక్షకులకు లెజెండ్ మూవీ బాగా ఎక్కేసింది.

Advertisement
CJ Advs

ఇప్పడు కూడా బాలాకృష్ణ ని అఖండ మూవీలో డ్యూయెల్ రోల్ లోనే చూపిస్తున్నాడు బోయపాటి. అది కూడా తండ్రి కొడుకులుగానే అఖండలో బాలకృష్ణ కనిపించబోతున్నాడు. ఒక యంగ్ పవర్ ఫుల్ కేరెక్టర్, మరొకటి అఘోర లాంటి మాస్ కేరెక్టర్ లో బాలయ్య ని చూపించబోతున్నాడు బోయపాటి. ఫాదర్ కేరెక్టర్ లో కనిపిస్తున్న బాలకృష్ణ పాత్ర సీనియర్ ఎన్టీఆర్ ని రిఫ్లెక్ట్ చేసేదిలా ఉంటుంది అని.. కుటుంబం కోసం అన్ని త్యజించి అఘోర అయ్యిపోయి.. ప్రశాంతంగా శివుడి ధ్యానంలో ఉన్న బాలకృష్ణ.. మళ్ళీ ఫ్యామిలీ, ప్రజల కోసం తిరిగిరావాల్సిన పరిస్థితులు కలిపిస్తే.. ఆయన అజ్ఞాతాన్ని వీడి తిరిగొస్తే.. ఎలా ఉంటుంది అనేదే అఖండ. మరి ఇప్పటికే BB3 అఖండ టీజర్స్ రెండూ మాస్ లో బాగా వెళ్ళింది. దానితో సినిమాపైభారీ అంచనాలు ఏర్పడిపోయాయి.

Balayya Father and Son Characters in Akhanda Movie:

 Akhanda Movie update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs