Advertisement
Google Ads BL

‘ఆచార్య’.. సిద్ధ యాక్షన్ మొదలైంది


మెగాస్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం మే 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇటీవల చిరు, చరణ్, పూజా హెగ్డేలతో తూర్పు గోదావరి జిల్లా మారేడు మిల్లి అడవుల్లో కొరటాల కొన్ని సన్నివేశాలను జరిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక యాక్షన్ పార్ట్ మినహా.. మిగతా అంతా చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తుంది. ఈ యాక్షన్ పార్ట్ రామ్ చరణ్‌పై చిత్రీకరించాల్సి ఉండగా.. గురువారం నుంచి హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో దీనిని చిత్రీకరించనున్నారట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొరటాల పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

 

ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న యాక్షన్ పార్ట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హైలెట్ అవుతున్నాయి. ఈ చిత్రంలో సిద్ధగా చేస్తున్న రామ్ చరణ్‌కు సంబంధించి ఈ యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుగుతోందట. ‘మిర్చి’ సినిమాలో యాడ్ చేసిన ఫైట్‌లా.. రామ్ చరణ్‌తో రైన్ ఎఫెక్ట్‌లో కొరటాల ఓ భారీ ఫైట్‌ని చిత్రీకరణ జరుపుతున్నాడట. ఈ ఫైట్‌ సినిమాకే కీలకం అంటున్నారు. భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుతున్న ఈ ఫైట్‌లో కేవలం చరణ్ మాత్రమే కనిపిస్తాడట. హైదరాబాద్‌లో వేసిన ధర్మస్థలి సెట్‌లో ఈ ఫైట్ చిత్రీకరణ జరుగుతుంది. ఇక రిలీజ్ విషయంలో కూడా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్, ఏపీలో టికెట్ల రేట్లపై నెలకొన్న పరిస్థితులు వెరసీ.. ఇప్పటికే సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ‘ఆచార్య’ కూడా అందుకు మినహాయింపు కాదని, వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా వార్తలు నడస్తున్నాయి. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లలో నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mega Star Acharya Movie Latest Update:

Rain Fight to Ram Charan in Acharya Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs