Advertisement
Google Ads BL

చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేష్


మహేష్ బాబు - కీర్తి సురేష్ కాంబోలో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ రీసెంట్ గా ఉగాది రోజున మొదలైంది. సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ తర్వాత సెకండ్ షెడ్యూల్ ని గోవా లో ప్లాన్ చెయ్యగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహేష్ గోవా షెడ్యూల్ పోస్ట్ పోన్ చెయ్యమనగానే పరశురామ్ గోవా షెడ్యూల్ ని పక్కనబెట్టి.. లేటెస్ట్ గా ఉగాది నుండి సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టారు. అయితే కరోనా వలన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మహేష్ సర్కారు టీం షూటింగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. మహేష్ అయితే షూటింగ్ స్పాట్ లో చాలా జాగ్రత్తలు పాటించడమే కాదు.. సర్కారు వారి పాట లొకేషన్ లో షూటింగ్స్ మెంబెర్స్ ప్రతి ఒక్కరి విషయంలో కేర్ తీసుకుంటున్నాడు.

Advertisement
CJ Advs

అందరి గురించి మహేష్ పర్సనల్ గా ఎంక్వైరీ చేస్తూ.. అందరూ బావున్నారా..లేదా అని అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడట. కీర్తి సురేష్, ఇంకా ఇందులో నటిస్తున్న నటులు, టెక్నీకల్ సిబ్బంది పేరు పేరునా అడిగి తెలుసుకుంటున్నాడట. అన్ని కరోనా నిభందనలు, జాగ్రత్తలతో సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చెయ్యడానికి మహేష్ కష్టపడుతున్నాడట. పరశురామ్ అండ్ నిర్మాతలు కూడా సర్కారు వారి పాట కోవిడ్ కారణంగా ఎవరూ సఫర్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చిత్రీకరణ చేపట్టారట.

Mahesh is very careful:

Mahesh Babu and Keerthy Suresh join the second schedule of Sarkaru Vaari Paata
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs