Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఓకే.. త్రివిక్రమ్ ఎప్పుడిస్తాడో క్లారిటీ!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రం విషయంలో క్లారిటీ ఇచ్చేసి.. షూటింగ్ స్టార్ట్ అయ్యే డేటే కాకుండా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాడు. వాస్తవానికి ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. త్రివిక్రమ్‌ను రీప్లేస్ చేస్తూ.. ఈ ప్రాజెక్ట్‌లోకి కొరటాల శివ వచ్చి చేరాడు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో అనుకున్నప్పుడు హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నాయి. కానీ త్రివిక్రమ్‌తో పాటు హారికా అండ్ హాసిని సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. చిన్నపాటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలన్నింటికీ క్లారిటీ రావాలంటే.. అసలేం జరిగిందో.. ఎవరో ఒకరు చెప్పాలి. లేదంటే.. అవి కొనసాగుతూనే ఉంటాయి. 

Advertisement
CJ Advs

 

మరి ఎన్టీఆర్ తన 30వ సినిమా కొరటాల శివతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుందని క్లారిటీ ఇచ్చేశాడు కానీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తన తదుపరి చిత్రం విషయంలో ఇంత వరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఉంటుందనేలా వార్తలు వినవస్తున్నాయి కానీ క్లారిటీ మాత్రం లేదు. మహేష్ బాబు సైడ్ నుంచి కూడా త్రివిక్రమ్ విషయమై ఎటువంటి క్లారిటీ రాలేదు. కొత్తగా ఇప్పుడు అల్లు అర్జున్‌తోనే మళ్లీ త్రివిక్రమ్ సినిమా ఉంటుందని, గీతా ఆర్ట్స్ అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ ‘ఐకాన్’ చిత్రం ఉంటుందనేలా వార్తలు వినవస్తున్నప్పటికీ.. దానిపై కూడా సరైన క్లారిటీ లేదు. రీసెంట్‌గా ‘ఐకాన్’ విషయంలో దర్శకుడు వేణు శ్రీరామ్.. ప్రభాస్ పేరు ఎత్తేసరికి కన్ఫ్యూజన్ మరింత ఎక్కువైంది. ఫైనల్‌గా త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్ట్‌లో క్లారిటీ వస్తేనే.. ఈ కన్ఫ్యూజన్‌కు తెరపడుతుంది. మరి ఆ క్లారిటీ ఎవరిస్తారో.. ఎప్పుడిస్తారో.. వేచి చూడాల్సి ఉంది.

Confusion Continues on Trivikram next Project:

Who is Trivikram Srinivas Next Film Hero?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs