Advertisement
Google Ads BL

మెగా ఫాన్స్ ని కూల్ చేసిన శంకర్


ఈ రోజు ఉదయం మెగా ఫాన్స్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కారణం దర్శకుడు శంకర్ రామ్ చరణ్ మూవీ ని పక్కబెట్టి.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో అపరిచుతుడు రీమేక్ చెయ్యబోతున్నాడు అనే అఫీషియల్ న్యూస్ చూసిన మెగా ఫాన్స్ కి ఒక్కసారిగా ఒణుకుపుట్టింది. రామ్ చరణ్ తో శంకర్ పాన్ ఇండియా మూవీ జులై కానీ ఆగష్టు నుండి కానీ పట్టాలెక్కాల్సి ఉంది. అసలే ఈ మధ్యన కారణాలు లేకుండా దర్శకులు హీరోల సినిమాలు మారిపోతున్నాయి. అలాంటిదే ఇప్పుడు చరణ్ విషయంలో కూడాజరిగిందేమో.. శంకర్ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కి మొగ్గు చూపి అధికారిక ప్రకటన ఇచ్చేసాడని దిగులుపడ్డారు.

Advertisement
CJ Advs

అయితే దర్శకుడు శంకర్ - రణవీర్ - పెన్ మూవీస్ కాంబోలో అపరిచితుడు రీమేక్ అనేది కరెక్ట్. అందులో మెగా ఫాన్స్ ఫీలవ్వాల్సింది ఏం లేదు అన్నట్టుగా దర్శకుడు శంకర్ మధ్యాన్నానికి మెగా క్లారిటి ఇచ్చాడు. అది రణవీర్ సింగ్ తో తాను కథా చర్చల్లో పాల్గొన్న ఫొటోస్ తో పాటుగా. రణవీర్ సింగ్ తో తన అపరిచితుడు మూవీ 2022 మిడ్ నుండి ఉండబోతుంది అని క్లారిటీ ఇచ్చేసాడు. అంటే జులై నుండి రామ్ చరణ్ - శంకర్ కాంబో మూవీ మొదలై వచ్చే ఏడాది మే కల్లా పూర్తి చేసి విడుదల చేసి ఆ తర్వాత దర్శకుడు శంకర్ రణవీర్ సింగ్ తో అపరిచితుడు మూవీ చేస్తాడన్నమాట.

మరి పొద్దున్న కంగారు పెట్టిన శంకర్ మధ్యాన్నానికి మెగా క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫాన్స్ కూల్ అయ్యారు. రామ్ చరణ్ మూవీ ఎక్కడ పక్కనబెట్టేశాడో శంకర్ అని భయపడిన మెగా ఫాన్స్ శంకర్ క్లారిటీతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Shankar clarity about Ram Charan movie:

Shankar - Ranveer Singh Movie starts in Mid 2022 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs