Advertisement
Google Ads BL

పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. వెళ్లిపోవడమే ఆలస్యం!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే.. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే.. మెగాభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మరొక్కసారి సెట్ అయితే బాగుండు అని.. ప్రతి మెగాభిమాని కోరుకున్నాడు. కొందరైతే.. హరీష్ శంకర్‌కి డైరెక్ట్‌గా సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు కూడా పంపారు. ‘బాస్ ఓకే అనాలే కానీ.. నేనెప్పుడూ సిద్ధమే..’ అంటూ అలాంటి మెసేజ్‌లకు హరీష్ శంకర్ కూడా సమాధానమిస్తూ వచ్చాడు. అభిమానులంతా బలంగా కోరుకున్నట్లే.. ఈ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమా ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత మెగాభిమానులు ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. 

Advertisement
CJ Advs

 

రీసెంట్‌గా విడుదలైన ‘వకీల్ సాబ్’ చిత్రం విపత్కర పరిస్థితుల్లో కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత పవన్ రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కాగా, రెండోది క్రియేటివ్ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’. ఈ రెండు చిత్రాలు కూడా చివరి దశ చిత్రీకరణలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత పవన్.. హరీష్ శంకర్‌తో చేయబోయే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటికే పవన్‌తో ఫొటోషూట్ నిర్వహించి.. లుక్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. లుక్ మాత్రమే కాదు.. ఈ చిత్రానికి టైటిల్ కూడా హరీష్ ఫైనల్ చేశాడంట. ‘సంచారి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ప్రీ లుక్.. ట్రెమండస్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ స్ర్కిప్ట్ లాక్ చేసిన హరీష్.. పవన్ కల్యాణ్ ఎప్పుడంటే.. అప్పుడు సెట్స్‌కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడట. అన్నీ బాగుంటే.. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. 

Pawan Kalyan and Harish Shankar Film pre production update:

Title and pre Production Completed for Harish and Pawan combo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs