యువీ క్రియేషన్స్ కి అసలైన చాలెంజ్


ప్రభాస్ - రాధాకృష్ణ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా విషయంలో ప్రభాస్ ఫాన్స్ ఎంతైతే అసంతృప్తిగా ఉన్నారో.. ప్రభాస్ కూడా తన లుక్స్ విషయంలో అంతే అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో రెండేళ్లుగా రాధేశ్యామ్ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది.. ఇప్పటికే బడ్జెట్ లిమిట్ దాటిపోయింది. ఇక రాధేశ్యామ్ నుండి ఏ లుక్ వదిలినా ప్రభాస్ ఫాన్స్ ని మెప్పించలేకపోతున్నారు. వింటేజ్ లుక్స్, అది ఇది అంటూ రాధేశ్యామ్ బడ్జెట్ ఇప్పటికే తడిసి మోపెడయ్యింది. అయితే ఇప్పుడు ప్రభాస్ కూడా రాధేశ్యామ్ లో తన లుక్ విషయం ఉన్న అసంతృప్తితో కొన్ని సీన్స్ రీ షూట్స్ పెట్టమంటున్నాడట. 

ఇప్పుడు ప్రభాస్ అడిగిన సీన్స్ రీ షూట్స్, అలాగే రాధేశ్యామ్ లో ఒక పాట చిత్రీకరణ ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు అవన్నీ కలిపి మరో మూడు కోట్లు బడ్జెట్ రాధేశ్యామ్ కి పెరిగిపోతోందట. మరి ప్రభాస్ అడిగింది యువీ ప్రమోద్ చేస్తాడా? ప్రభాస్ ఓన్ బ్యానర్ లాంటి యువీ క్రియేషన్స్ ప్రభాస్ అడిగితె కాదనగలరా? ప్రభాస్ క్లోజ్ అప్ షూట్స్ అవి ఇవి అంటూ ఇప్పటికే లిమిట్ దాటిన బడ్జెట్ చూసిన యువీ నిర్మాతలకు కక్కలేకమింగలేక ఉన్నారని.. రాధేశ్యామ్ రీ షూట్స్ విషయంలో వారు తర్జనభరాజాలు పడుతున్నారు. అసలే రిలీజ్ డేట్ ఇచ్చేసారు. ఇప్పుడు రీ షూట్స్ అంటే సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో అనే కంగారులో కూడా వారు ఉన్నట్లుగా తెలుస్తుంది.

The real challenge for UV Creations:

Prabhas Radhe Shyam to be reshot?
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES