అల్లు అర్జున్.. సుకుమార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప సినిమా టీజర్ అన్ని భాషల్లో ఊపేసింది. సుకుమార్ పాన్ ఇండియా స్టాండర్స్ లో పుష్ప ని భారీగా చూపించబోతున్నాడని పుష్ప టీజర్ ప్రూవ్ చేసింది. కరోనా కష్టాలు లేకుండా ఉంటే.. అనుకున్న టైం కే పుష్ప మూవీ ఆగష్టు 13 న థియేటర్స్ లోకి వచ్చెయ్యడం ఖాయం. ఇక ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాలతో పాన్ ఇండియా మూవీకి రెడీ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే కొరటాల - అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ప్రకటన వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ ఫాన్స్ కన్ఫ్యూజన్ ఏమిటంటే.. కొరటాల శివ ఆచార్య తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చెయ్యాల్సి ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ తో కొరటాల మూవీకి కమిట్ అయ్యాడు. అల్లు అర్జున్ తో మూవీ ఎలా అంటూ ఫాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.
వకీల్ సాబ్ హిట్ తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ తో ఐకాన్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అందుకే పుష్ప - కొరటాల మూవీకి గ్యాప్ ఇవ్వబోతున్నాడంటున్నారు. మరోపక్క అల్లు అర్జున్ ఫాన్స్ కొరటాల - నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ని బన్నీ - కొరటాల మూవీపై క్లారిటీ ఇమ్మని గోల చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ - కొరటాల మూవీపై సుధాకర్ స్పష్టతనిచ్చారు.
కొరటాల శివ - అల్లు అర్జున్ మూవీ ఏప్రియల్ 2022 నుంచి మొదలవుతుంది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ వారితో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం.. మీరు వర్రీ అవ్వొద్దు.. ఆ సినిమా అప్ డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందజేస్తామంటూ ఆయన అల్లు ఫాన్స్ కి మాటివ్వడంతో వాళ్ళు కూల్ అయ్యారు. పుష్ప రిలీజ్ తర్వాత ఏప్రియల్ 2022 మధ్యలో అల్లు అర్జున్ ఐకాన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఛాన్స్ ఉందంటున్నారు.