దేశం లో అన్ని రాష్ట్రాల కన్నా మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. వేలల్లో కేసులు, వందల్లో మరణాలతో మహారాష్ట్ర అల్లకల్లోలంగా ఉంది. అక్కడ ఇప్పటికే వీకెండ్ లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి. పర్యాటక ప్రదేశాలు, పార్క్ లు అన్ని మూసేసారు. ఇప్పటికే హాస్పిటల్ బెడ్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. కరోనా కేసులు తప్ప మరే ఇతర రోగులను హాస్పిటల్ లో చేర్చుకోవద్దని సీఎం ఉద్దవ్ డాక్టర్స్ ని కోరారు. అయితే మహారాష్ట్రలో లాక్ డౌన్ పై వస్తున్న వార్తలకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే స్పష్టతనిచ్చారు.
మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్ ఉండదని, కేవలం మహా జనతా కర్ఫ్యూ ఓ 15 రోజులు పాటు అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. 15 రోజులు 144 సెక్షన్ నడుస్తుంది అని, ప్రజలు ఆవరసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రావొద్దని సీఎం ఉద్దవ్ ప్రకటించారు. కేవలం మహా జనతా కర్ఫ్యూ అమలు చేస్తామని, లాక్ డౌన్ లాంటి ఆంక్షలు అమలవుతాయని, కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామని ఉద్దవ్ ప్రకటించారు.