Advertisement
Google Ads BL

రెండోసారి కరోనా బారిన పడ్డ బండ్ల గణేష్


కరోనా సెకండ్ వేవ్ ప్రజలని, సెలబ్రిటీస్ ని విపరీతంగా భయపెట్టేస్తుంది. పలువురు సెలెబ్రెటీస్ కరోనా బారిన పడుతుండడం అందరిని కంగారు పెట్టేస్తుంది. రీసెంట్ గా దిల్ రాజు కి కరోనా పాజిటివ్ రాగా.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా రావడంతో ఆయన ముందు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్ కి వెళ్లిపోయారు. తాజాగా బండ్ల గణేష్ కి కరోనా సెకండ్ టైం రావడం కలవరపెడుతుంది. కరోనా వచ్చిన కొత్తల్లోనే బండ్ల కరోనా బారిన పడి కంగారు పడినా.. త్వరగానే కోలుకున్నాడు. రీసెంట్ గా వకీల్ సాబ్ ఈవెంట్ లో బండ్ల ఇచ్చిన స్పీచ్ తెగ ట్రెండ్ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే వకీల్ సాబ్ ఈవెంట్ తర్వాత బండ్ల గణేష్ కి కాస్త ఒళ్ళు నొప్పులు, ఫీవర్ వచ్చిందట. అది తగ్గకుండా క్రమేణా పెరగడంతో బండ్ల గణేష్ కరోనా టెస్ట్ చేయించుకోగా రెండోసారి పాజిటివ్ గా తేలిందట. మరి కరోనా ఒకసారి వచ్చిన వారికీ రెండోసారి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ బండ్ల రెండోసారి కరోనా బారిన పడడంతో ఆయన హాస్పిటల్ చేరినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బండ్ల గణేష్ ఐసియు లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉందని తెలుస్తుంది.

Bandla Ganesh tested Covid-19 positive:

Bandla Ganesh tested Covid-19 positive, Admitted to ICU
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs