Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ ప్రమోషన్స్ బాగా కలిసొచ్చాయ్


వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత పేరు, క్రేజు వచ్చాయో.. అందులో నటించిన హీరోయిన్ నివేత థామస్, అంజలి పెరఫార్మెన్స్ కి అంతే పేరొచ్చింది. అంతేకాదు.. అంజలి అయితే వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో అదరగొట్టేసింది. సారీస్, గ్లామర్ డ్రెస్సులతో అంజలి అందరి కళ్ళలో పడింది. వకీల్ సాబ్ సినిమా కన్నా వకీల్ సాబ్ ప్రమోషన్స్ కే అంజలి ఎక్కువ కష్టపడింది. మరి కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కితే.. దక్కినట్టే అనిపిస్తుంది. అంజలి కి వకీల్ సాబ్ సినిమానే కాదు, అటు ప్రమోషన్స్ కూడా బాగానే కలిసొచ్చాయ్. ఎలా అంటే అనిల్ రావిపూడి కన్ను అంజలి పై పడిందట.

Advertisement
CJ Advs

అనిల్ రావిపూడి - దిల్ రాజు - వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 మూవీలో తమన్నా - మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తుంటే.. మరో కేరెక్టర్ కోసం బాలయ్య భామ సోనాల్ చౌహన్ ని అనుకున్నాడట అనిల్ రావిపూడి. అయితే ఇప్పుడు సోనాల్ ప్లేస్ లోకి అంజలి ని తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. అనిల్ రావిపూడి ఇప్పటికే అంజలి తో చర్చలు జరిపినట్టుగా, త్వరలో అంజలి ఎఫ్ 3 షూటింగులో పాల్గొంటుందని కూడా అంటున్నారు. మరి ఇదే నిజమైతే అంజలికి వకీల్ సాబ్ ప్రమోషన్స్  బాగా హెల్ప్ చేసినట్టే. అంజలి కూడా వచ్చిన ఎలాంటి అవకాశాన్ని చేజార్చుకోకూడదని ఫిక్స్ అయ్యిందట.

Chance for Anjali in f3:

Anjali roped in for Anil Ravipudi F3?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs