Advertisement
Google Ads BL

ఫాన్స్ లో జోష్ పుట్టించిన RRR పోస్టర్


రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పై ఫాన్స్ లో ఎంత క్రేజ్ ఉందో.. పాన్ ఇండియా లేవల్లో ట్రేడ్ లోనూ అంతే క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ కోసం ఫాన్స్ ఎప్పటికప్పుడే ఎదురు చూడడం అలవాటైపోయింది. నిన్నటికి నిన్న ఆర్ ఆర్ ఆర్ నుండి ఉగాది స్పెషల్ గా ఏదైనా సాంగ్ వదలొచ్చు కదా అని ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలని హీరోల ఫాన్స్ అడిగితే వారు దానికి రిప్లై గా టైం ఉంది.. సాంగ్స్ కన్నా ముందు చాలా ఉన్నాయ్ అన్నారు కానీ ఉగాది కి ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ రిలీజ్ అని మాత్రం చెప్పలేదు. ఉగాదికి ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ ఉండదనుకున్న ఫాన్స్ కి ఆర్.ఆర్.ఆర్ టీం సర్ప్రైజ్ ఇచ్చేసింది.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్, రామ్ చరణ్ ని వాళ్ళ ని ఆరాధించే ప్రజలు ఎత్తుకుని గాల్లోకి ఎగేరెయ్యగా.. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నవ్వుతున్న పోస్టర్ ని ఆర్.ఆర్.ఆర్. నుండి ఉగాది స్పెషల్ గా వదిలింది టీం. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేతుల మీద అలా గాల్లో ఎగురుతుంటే.. అదేదో తామే తమ హీరోలని ఎత్తి పైకి ఎగెరిసినట్టుగా ఫీలవుతున్నారు ఎన్టీఆర్ మరియు చరణ్ ఫాన్స్. అసలు ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ అంటే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఉగాది పోస్టర్ ఫాన్స్ లో జోష్ నింపింది.

RRR New Poster Released on Ugadi:

RRR New Poster: Fans Raving
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs