పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సంచలనం వకీల్ సాబ్ థియేటర్స్ దగ్గర సందడి చేస్తుంది. వకీల్ సాబ్ బాక్సాఫీసు కలెక్షన్స్ బయటికి రాకపోయినా.. థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల సందడి చూస్తుంటే వకీల్ సాబ్ కి రికార్డు కలెక్షన్స్ రావడం ఖాయం. అయితే వకీల్ సాబ్ విడుదలైన రెండో రోజు నుండి వకీల్ సాబ్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ, వకీల్ సాబ్ ని అమెజాన్ ప్రైమ్ 30 కోట్లకి కొనేసింది అంటూ ప్రచారం మొదలైంది. గతంలో 100 కోట్లకి అడిగినా ఇవ్వని దిల్ రాజు వకీల్ సాబ్ థియేటర్స్ లో విడుదలయ్యాక 30 కోట్లకి అమెజాన్ కి అమ్మేసాడనే టాక్ నడుస్తుంది.
అయితే తాజాగా వకీల్ సాబ్ సినిమా కి ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అవ్వలేదని, అసలు ఏ ఓటిటి లోనూ వకీల్ సాబ్ ఇప్పట్లో రాదని, వకీల్ సాబ్ ఓటిటిలో వచ్చేస్తుంది అనే రూమర్స్ నమ్మొద్దు అని వకీల్ సాబ్ టీం చెబుతుంది. వకీల్ సాబ్ ని థియేటర్స్ లోనే చూడమని, థియేటర్ కిక్ మిస్ కాకండి అంటూ వకీల్ సాబ్ నిర్మాతలు వకీల్ సాబ్ ని ఇప్పట్లో ఆన్ లైన్ లో రిలీజ్ చెయ్యడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా స్పష్టతనిచ్చారు. మరి వకీల్ సాబ్ ఆన్ లైన్ లో వచ్చేస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లడం తగ్గిస్తారు. అందులోనూ కరోనా కారణంగా థియేటర్స్ కి వెళ్ళడానికి వెనకాడుతున్న ఆడియన్స్ కి వకీల్ సాబ్ ఆన్ లైన్ లో వస్తుంది అంటే ఇంకేముంది. అందుకే వకీల్ సాబ్ టీం ముందుగా సినిమాని థియేటర్స్ లోనే చూడండి అంటూ కోరుతుంది.