Advertisement
Google Ads BL

ఆఫిషియల్: ఎన్టీఆర్-కొరటాల ఫిక్స్


స్టార్ హీరోలంతా ఒకటికి రెండు సినిమాలను లైన్ లో పెట్టుకుని తమ సినిమాల షూటింగ్స్ కూల్ గా చేసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు మెగా ఫాన్స్ ని కన్ఫ్యూషన్ లో పెట్టిన రామ్ చరణ్ కూడా తన తదుపరి మూవీ ని పాన్ ఇండియా లెవల్లో టాప్ దర్శకుడితో ప్రకటించేశాడు. అయితే అన్ని సెట్ అయ్యి సినిమా సెట్స్ మీదకెళ్లబోతుంది అనుకున్న ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మూవీ మొదలు కాకుండానే ఆగిపోవడంతో ఎన్టీఆర్ ఫాన్స్ లో కలవరం మొదలయింది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ NTR30 ఆగిపోయింది అనే వార్త తో ఎన్టీఆర్ ఫాన్స్ కి టెంక్షన్ స్టార్ట్ అయ్యింది. అలా వైకుంఠపురములో సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ అనగానే సంబరాలు జరుపుకున్న ఫాన్స్.. ఆ మూవీ ఆగిపోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.

Advertisement
CJ Advs

అప్పటినుండి ఎన్టీఆర్ కూడా సైలెంట్ గానే ఉంటున్నాడు. NTR30 పై వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ కాంపౌండ్ కూడా చెక్ పెట్టలేదు. అయితే ఈ రోజు సాయంత్రం NTR30 పై క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా ఓ అనౌన్సమెంట్ వచ్చేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ కూల్ అయ్యారు. అనుకున్న టైం కి  అనుకున్నట్టుగానే NTR30 అనౌన్సమెంట్ వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ ఆగిపోయి.. ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో సెకండ్ మూవీ NTR30 అనౌన్సమెంట్ ఇచ్చేసారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సూపర్ హిట్. అదే కాంబోలో సెకండ్ మూవీ గా ఈ NTR30 తెరకెక్కబోతుంది. 

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ సినిమాకి మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఇప్పుడు సినిమా అనౌన్సమెంట్ తో పాటుగా రిలీజ్ డేట్ ప్రకటించి షాకిచ్చారు. ఏప్రిల్ 29, 2022 న ఎన్టీఆర్ - కొరటాల కాంబో NTR30 రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించేసారు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ అనగానే ఎన్టీఆర్ ఫాన్స్ సెలెబ్రేషన్స్ మొదలు పెట్టేసారు.

NTR30: NTR and Koratala Siva combo fix:

A massive film to be made in the combination of NTR and Koratala Siva 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs