Advertisement
Google Ads BL

‘ఎన్టీఆర్ 30’లో మార్పు.. లాజిక్‌గా లేదు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎందుకు ఆసక్తికరం అంటే.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా సంచలన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని ప్రకటించారు. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ కూడా అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ సైడ్ నుంచి కూడా స్ర్కిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయని, ఎన్టీఆర్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పూర్తికాగానే సెట్స్‌పైకి వెళ్లేందుకు టీమంతా రెడీగా ఉన్న సమయంలో.. ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించి అనేకానేక రకాలుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Advertisement
CJ Advs

 

అయితే ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని కొర‌టాల‌తోనూ, త్రివిక్ర‌మ్ తన తదుపరి చిత్రాన్ని మ‌హేష్‌తోనూ చేయ‌బోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ‌ఇరు వర్గాలు.. ఈ మార్పును ఓ ఆరోగ్యక‌ర‌మైన వాతావ‌రణంలోనే చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌నే ఈ రోజు(సోమవారం) సాయంత్రం అధికారికంగా తెలియజేయనున్నారని టాక్ నడుస్తుంది. అయితే ‘ఆచార్య’ తర్వాత కొరటాల శివ.. ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’తో చిత్రానికి కమిట్ అయి ఉన్నాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న ‘సర్కారి వారి పాట’ ఇంత వరకు ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ చిత్రసీమను వణికిస్తుంది. అలాగే ‘అల వైకుంఠపురములో’ చిత్రం పూర్తయ్యి దాదాపు సంవత్సరంన్నర కావొస్తుంది. మహేష్ బాబుతో సినిమా అంటే.. మరో ఆరు నెలలపాటైనా త్రివిక్రమ్ ఖాళీగానే ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితిల్లో ఓ టాప్ డైరెక్టర్‌కి అంత గ్యాప్ అంటే.. ఆలోచించాల్సిన విషయమే. మరి ఏ విధంగా చూసినా.. కాంబినేషన్ మారడం అనేది ఏమంత కరెక్ట్‌గా అయితే లేదు. చూద్దాం.. ఈ రోజు సాయంత్రం ఎటువంటి అప్‌డేట్ వస్తుందో..!

Jr NTR 30 Movie Official Update Today Evening:

Koratala replaced Trivikram for Jr NTR 30 movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs