Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ కి రెండు రకాలుగా పరీక్ష


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూడు రోజుల నుండి బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. వీకెండ్ లో హిట్ టాక్ వచ్చిన సినిమాల కలెక్షన్స్ కన్నా పవన్ వకీల్ సాబ్ కలెక్షన్స్ రెట్టింపు ఉన్నాయి. ప్రేక్షకులు, క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వకీల్ సాబ్ కి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన మౌత్ టాక్ కూడా కలెక్షన్స్ విపరీతంగా పెరగడానికి కారణమయ్యాయి. గత మూడు రోజులు వకీల్ సాబ్ థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల సందడి, ఫాన్స్ హంగామా మాములుగా లేదు. కరోనని కూడా లెక్క చెయ్యకుండా ప్రేక్షకులు వకీల్ సాబ్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. అయితే ఈ మూడు రోజుకాలు ఓకె.. కానీ ఈ రోజు నుండే పవన్ కి అసలైన పరీక్ష మొదలు కాబోతుంది. వీకెండ్ జనాలు ఖాళీగా ఉంటారు.. దానితో థియేటర్స్ ఫుల్.

Advertisement
CJ Advs

కానీ సోమవారం నుండి వకీల్ సాబ్ కి గట్టి పరీక్ష మొదలవుతుంది. ఇటు వీక్ డేస్ మొదలు కావడం ఒక కారణం, మరో కారణం కరోనా. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో ప్రేక్షకులు వకీల్ సాబ్ థియేటర్స్ కి వస్తారా? మరొకటి ఐపీఎల్. వకీల్ సాబ్ రిలీజ్ అయిన రోజునే గ్రాండ్ గా మొదలైన ఐపీఎల్ ప్రతి రోజు రాత్రి జరిగే మ్యాచ్ లకి యూత్ టీవీలని వదలరు. క్రికెట్ లవర్స్ వకీల్ సాబ్ ని పట్టించుకోరు. దానితో వకీల్ సాబ్ కి ఈ సోమవారం నుండి గట్టి పరీక్షనే ఎదుర్కోబోతుంది. అయితే దిల్ రాజు వకీల్ సాబ్ ఆఫీషియల్ కలెక్షన్స్ ఇవ్వమని చెప్పాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే ఈకలు పీకి వకీల్ సాబ్ కలెక్షన్స్ డౌన్ అయ్యాయి అంటూ యాంటీ ఫాన్స్ ఎండగట్టేవారే.

Burning difficulties for Vakeel Saab:

The original test for Vakeel Saab is on Monday 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs