Advertisement
Google Ads BL

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అప్ డేట్స్


ఉగాది వచ్చేసింది.. కరోనా కారణంగా థియేటర్స్ లో సినిమాలు లేకపోయినా.. ఉగాది లుక్స్ తో హీరోలు రెడీ అయ్యారు. ఉగాదికి తమ సినిమాల లుక్స్ రిలీజ్ చేసేస్తున్నారు. ముందుగా రవితేజ ఖిలాడీ టీజర్ ని విడుదల చేసింది టీం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు, మూడు సినిమాల అప్ డేట్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఒకటి రవితేజ ఖిలాడీ టీజర్, రెండవది అడివి శేష్ నటించిన మేజర్ ఈ రోజు సాయంత్రం పాన్ ఇండియా  టీజర్ గా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న మేజర్ టీజర్ ని హీరో నాని ముందే చూసేసి.. టీజర్ అద్భుతం అంటూ చెప్పడంతో అందరిలో మేజర్ టీజర్ పై ఆసక్తి మొదలైపోయింది. ప్రస్తుతం ఈ టీజర్ కోసం మహేష్ ఫాన్స్, పాన్ ఇండియా ప్రేక్షకులు వెయిటింగ్.

Advertisement
CJ Advs

ఇక మరో స్టార్ హీరో సినిమా అనౌన్సమెంట్ ఈ రోజు సాయంత్రమే రాబోతుంది. అది NTR30. NTR30 మూవీ ప్రకటన ఈ రోజు సాయంత్రం 7.02 నిమిషాలకు ఉండబోతుంది.. అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ రోజు లభించును అని మహేష్ కోనేరు ట్వీట్ చేసిన దగ్గర నుండి NTR30 ని సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంచారు ఎన్టీఆర్ ఫాన్స్. NTR30 త్రివిక్రమ్ తప్పుకోవడంతో.. ఆ ప్లేస్ లోకి రాబోయే దర్శకుడు ఎవరనే దాని మీద ఎన్టీఆర్ ఫాన్స్ ఉత్సుకతతో ఉన్నారు. కొరటాల - ఎన్టీఆర్ కాంబోలో మూవీ  ఉండబోతుంది అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఆ అప్ డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మేజర్ టీజర్ అప్ డేట్, ఖిలాడీ టీజర్, NTR30 అప్ డేట్ ట్విట్టర్ లో ట్రేండింగ్ లో ఉన్నాయి.

Trending updates on social media:

NTR30, Adivi Sesh major Teaser, KHiladi Teaser Updates trending on Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs