Advertisement
Google Ads BL

అంజలికి ఎలాంటి హెల్ప్ అవుతుందో?


వెంకటేష్ - మహేష్ కాంబోలో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో సీతమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్ అంజలి తర్వాత గీతాంజలి అనే లేడి ఓరియెంటెడ్ మూవీ తో ఆకట్టుకున్నప్పటికీ.. అంజలికి తెలుగులో మంచి అవకాశాలు రాలేదు. అటు తమిళ్ లోనూ అంజలి కెరీర్ టర్న్ అయ్యే అవకాశం తగల్లేదు. ఈమధ్యన బాగా సన్నబడి లుక్స్ పరంగా తేలిపోతున్న అంజలి పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ లో నటించింది. 

Advertisement
CJ Advs

అంతేకాకుండా వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో వీలైనంత గ్లామర్ షో చేసింది అంజలి. వకీల్ సాబ్ ఈవెంట్ లో అంజలి గ్లామర్ షో టాలీవుడ్ స్పెషల్ గా మట్లాడుకునేలా ఉంది. ఇక వకీల్ సాబ్ విడుదలైంది. సినిమా సూపర్ హిట్. అందులో అంజలి పెరఫార్మెన్స్ ని క్రిటిక్స్, ఆడియన్స్ స్పెషల్ గా పొగుడుతున్నారు. నివేత థామస్, అంజలి నటన వకీల్ సాబ్ మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా ఉంది. మరి వకీల్ సాబ్ హిట్ అంజలి కెరీర్ ని ఎమన్నా టర్న్ చేస్తుందా? టాలీవుడ్ హీరోలెవరైనా అంజలికి అవకాశాలిస్తారా? చూద్దాం అంజలి కి వకీల్ సాబ్ ఏ విధంగా హెల్ప్ అయ్యిందో.

What kind of help would Anjali get through this?:

What would Anjali get from Vakeel Saab Hit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs