ఉప్పెన సినిమా వెండితెర మీద అద్భుతమైన మ్యూజికల్ హిట్.. యూత్ఫుల్ హిట్. కృతి శెట్టి- వైష్ణవ తేజ్ కాంబోని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు యూత్ విజిల్స్ , కేకలు.. దేవిశ్రీ మ్యూజిక్ కి యువత ఫిదా అయ్యింది. ఉప్పెన బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. దర్శకుడు బుచ్చిబాబు కి ఏకంగా నిర్మాతలు కారునే ప్రెజెంట్ చేసారు. ఇక ఉప్పెన మేకింగ్ వీడియోస్, సాంగ్ మేకింగ్స్ కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. అంత అద్భుతమైన పెరఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవ తేజ్, కృతి శెట్టిలని పొగడని ప్రేక్షకుడు లేదు. ఇప్పుడు అదే ఉప్పెన సాంగ్ ని ఓ స్కిట్ లో బుల్లితెర లవర్స్ గా పిలిచే రష్మీ గౌతమ్- సుడిగాలి సుధీర్ లు చేసి అద్భుతః అనిపించారు.
ఉగాది పండుగ రోజున ఈటీవీలో ప్రసారం కాబోతున్న ఉగాది జాతి రత్నాలు ప్రోగ్రాం లో రష్మీ - సుధీర్ జంటగా జలజల పాతం సాంగ్ ని చాలా రొమాంటిక్ గా చేసి ప్రోగ్రాం మీద హైప్ క్రియేట్ చేసారు. జలజల పాతంలో వైష్ణవ తేజ్ - కృతి శెట్టి లు ఎలా అయితే రొమాంటిక్ గా అద్భుతమైన పెరఫార్మెన్స్ చూపించారో.. అంతే అద్భుతంగా సుధీర్ - రష్మీ జోడి ఉప్పెన జలజల పాతం సాంగ్ లో ఆశీ -బెబమ్మలుగా పెరఫార్మ్ చేసి అదుర్స్ అనిపించారు. నిజమైన ప్రేమికుల్లా పడవలో.. వర్షపు చినుకుల మధ్యన సుధీర్ - రష్మీ లు చేసిన ఈ పెరఫార్మెన్స్ ఆ ప్రోగ్రాంకే హైలెట్ అనేలా ఉంది. మరి ఇలాంటి ఎన్నో అద్భుతాలతో రేపు ఉగాది స్పెషల్ గా ఈ ఉగాది జాతి రత్నాలు ప్రోగ్రాం ఈటీవీలో ప్రసారం కాబోతుంది.