Advertisement
Google Ads BL

హాష్ అక్కినేనితో రిలాక్స్ అవుతున్న చైతు


నాగ చైతన్య రీసెంట్ మూవీ లవ్ స్టోరీ ఏప్రిల్ 16 న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వెవ్, థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గించిన కారణంగా ఆ సినిమాని వాయిదా వేశారు. ప్రస్తుతం లవ్ స్టోరీ ప్రమోషన్స్ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోయే సినిమా కి గట్టిగా ప్రమోషన్స్ చెయ్యాల్సింది పోయి.. సినిమా వాయిదా పడడంతో నాగ చైతన్య రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళాడు. సాయి పల్లవి తన విరాట పర్వం మూవీ డబ్బింగ్ లో  బిజీగా ఉంది. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ కొత్త డేట్ కోసం ఆలోచిస్తున్నారు. 

Advertisement
CJ Advs

లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య - శేఖర్ కమ్ముల, సాయి పల్లవి లు రానా నెంబర్ వన్ యారి షో లో చేసిన రచ్చ ఈ రోజు నైట్ 9 కి జెమినిలో ప్రసారం కాబోతుంది. ఇక ప్రస్తుతం చైతూ మాత్రం తమ పెంపుడు కుక్క హాష్ అక్కినేనితో సేద తీరుతున్నాడు. చైతూ - హాష్ అక్కినేని ఉన్న ఫోటో ని సమంత అక్కినేని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నేషనల్ పెట్స్ డే విషెస్ చెప్పింది. మరి సమంత కి ఎంతో ఇష్టమైన చైతు - హాష్ అక్కినేని లు అలా కూల్ గా రిలాక్స్డ్ గా పడుకుని వున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Samantha Akkineni shares cute pic:

Naga Chaitanya lovey moments with pet dog Hash
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs