Advertisement
Google Ads BL

NTR30 ఆఫీషియల్ అప్ డేట్ వచ్చేస్తుంది


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో మొదలు కావాల్సిన NTR30 ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మూవీకి కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తరవాత ఎన్టీఆర్ ఫామిలీస్ కి, యూత్ కి నచ్చే కేరెక్టర్ తో సినిమా చెయ్యాలనుకున్నాడు. జనవరిలోనే NTR30 పూజా కార్యక్రమాలతో మొదలు కావల్సింది. అటు ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం, ఇటు త్రివిక్రమ్ ఫ్రెండ్ పవన్ ఏకే రీమేక్ కోసం టైం స్పెండ్ చెయ్యడంతో వీరి మూవీ మొదలు కావడానికి ఆలస్యమైంది.

Advertisement
CJ Advs

ఈలోపు ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబో NTR30 ఆగిపోయింది అని, త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB 28 చేయబోతున్నాడనే న్యూస్ లు సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి. ఇంకా ఒకడుగు ముందుకేసి మహేష్ - త్రివిక్రమ్ కాంబో మూవీ హీరోయిన్ గా పూజ హేగ్డ్ ని ఫిక్స్ చెయ్యడమే కాదు.. పూజ హెగ్డే రెమ్యునరేషన్ గాసిప్స్ కూడా వండి వార్చారు. అయితే ఎన్టీఆర్ తన తదుపరి మూవీని సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో చేయబోతున్నాడనే టాక్ మొదలైంది. ఈలోపు నిర్మాత, ఎన్టీఆర్ పీఆర్ టీం మహేష్ కోనేరు.. NTR30 అధికారిక అప్ డేట్ టుమారో ఈవెనింగ్ ఉండబోతుంది అని.. అన్ని ప్రశ్నలకు సమాధానం రేపు లభించును.. సైన్ అఫ్ ది హార్న్స్.. అంటూ ట్వీట్ చెయ్యడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ NTR30  అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అప్ డేట్ ఏమైఉంటుంది అబ్బా అని తెగ ఇదైపోతున్నారు వారు.

Official Announcement Of NTR 30 Tomorrow:

Much awaited NTR30 official update coming up tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs