ఈమధ్యన ఏ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నా.. కాంట్రవర్సీలు వాటికవే మోదలైపోతున్నాయి. కొన్ని సినిమాలు ఆ కాంట్రవర్సీ వల్ల ఇబ్బందులు పడితే.. కొన్ని సినిమాలకు ఆ కాంట్రవర్సీ పబ్లిసిటీగా మారుతుంది . తాజాగా చిరు ఆచార్య - రానా విరాట పర్వం మూవీ ల విషయంలో రిలీజ్ కి ముందే అంటే.. చాలామందే వివాదాల్లో ఇరుక్కున్నాయి. ఆచార్య సినిమా - విరాట పర్వం సినిమాలు రెండూ నక్సల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు. విరాట పర్వం సినిమాలో రానా నక్సలైట్ గా అభ్యుదయ భావాలున్న వ్యక్తిగా కనిపిస్తుంటే.. ఆచార్య లో చిరు - రామ్ చరణ్ లు నక్సలైట్ పాత్రలు పోషిస్తున్నారు.
ఆ రెండు కథల్లో నక్సలైట్స్ గా కనిపించనున్న హీరోలు సమాజాన్ని చైతన్య వంతం చెయ్యడం అటుంచి.. అలాంటి సినిమాల వలన సమాజం చెడిపోతుందని, యువతరానికి తప్పుడు సంకేతాలు అందుతాయని.. ఇలాంటి సినిమాలని యాంకరేజ్ చెయ్యకూడదని, కాబట్టి వాటిని సెన్సార్ చెయ్యొద్దు అంటూ యాంటీ టెర్రరిజం ఫారమ్ అనే సంస్థ ఓ వినతి పత్రం సమర్పించింది. ఒకవేళ మీరు సెన్సార్ చేసి సినిమా రిలీజ్ కి అనుమతులిస్తే.. ఆ సినిమాలు విడుదలైన థియేటర్స్ ముందు ధర్నాలు చేస్తామంటూ యాంటీ టెర్రరిజం ఫారమ్ హెచ్చరిస్తుంది. మరి యాంటీ టెర్రరిజం ఫారమ్ బెదిరింపులకు ఆచార్య, విరాట పర్వం సినిమాలు సెన్సార్ కాకుండా ఆగిపోయితాయా? చూద్దాం ఏం జరుగుతుందో అనేది.