విపరీతమైన బజ్ ఉన్న వకీల్ సాబ్ ప్రమోషన్స్ ని టీం కూడా అంతే ఆసక్తిగా నిర్వహించింది. ముగ్గురు హీరోయిన్స్ అంజలి, నివేత థామస్, అనన్య లు వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో హడావిడి చేసారు. ఆఖిరికి పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టేసాడు. అయితే ఈ సినిమాలో పవన్ వైఫ్ కేరెక్టర్ లో నటించిన శృతి హాసన్ వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడంతో పెద్ద చర్చే నడిచింది. శృతి హాసన్ పాత్ర నిడివి తక్కువ ఉన్న కారణంగానే ఆమె వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో ఇంట్రెస్ట్ పెట్టలేదన్నారు. ఇక ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ లేని కారణంగానే వకీల్ సాబ్ ట్రైలర్ లో శృతి కి స్పెస్ ఇవ్వలేదనే టాక్ నడిచింది. తన పాత్ర నిడివి పై శృతి హాసన్ అలిగి వకీల్ సాబ్ ని ప్రమోట్ చెయ్యలేదనుకున్నారు.
నిజంగా అనుకున్నట్టుగానే వకీల్ సాబ్ లో శృతి కేరెక్టర్ ఏమంత గొప్పగా లేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో శృతి హాసన్ కనిపించింది. క్రిటిక్స్ కూడా అంజలి, నివేత థామస్, అనన్య ల నటనను పొగిడారు కానీ శృతి హాసన్ పేరే ఎత్తలేదు. వకీల్ సాబ్ సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్స్ లో ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ ఒకటి. అందులో శృతి హాసన్ ప్రాధాన్యత లేని పాత్ర చెయ్యడంతో ఆమెని గుర్తించిన పాపానపోలేదు. శ్రుతి హాసన్ సినిమాకు మైనస్ అయింది. అలాగే శృతి లుక్స్ ఏమాత్రం బాగా లేవు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషన్ మిస్ కావడానికి శృతి హాసన్ కారణం. ఇది శృతి పాత్రపై క్రిటిక్స్ మాట. అందుకే శృతి హాసన్ కూడా వకీల్ సాబ్ ని లైట్ తీసుకున్నట్టుగా ఉంది.