Advertisement
Google Ads BL

ఉగాది హడావిడి ఉండదేమో అనుకున్నారు


కరోనా సెకండ్ వెవ్ ఉధృతిని తట్టుకునేందుకు లాక్ డౌన్ పెట్టకపోయినా.. కరోనా నిబంధనలు పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్లలో భాగంగా థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో నడవాలని నిర్ణయించారు. అందుకే చాలామంది హీరోలు తమ సినిమాలు 50 పర్సెంట్ అక్యుపెన్సీతో  రిలీజ్ చేయలేమని, అందులోనూ కరోనా ఉధృతి కారణంగా సినిమాలకు ప్రేక్షకులను రమ్మనడం కరెక్ట్ కాదంటూ.. నాగ చైతన్య లవ్ స్టోరీని ఇప్పటికే వాయిదా వేశారు. మిగిలిన వారు కూడా వాయిదాలు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఉగాదికి రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా పడిపోయింది. గత ఏడాది ఉగాది లాగే ఈ ఏడాది ఉగాది చప్పగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కానీ చాలామంది హీరోలు తమ తమ సినిమాల లుక్స్ రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. అందులో ముందుగా రవితేజ ఖిలాడీ టీజర్ ని ఉగాదికి ఒకేరోజు ముందుగా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

Advertisement
CJ Advs

తాజాగా అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం మేజర్ మూవీ టీజర్ ఏప్రిల్ 12 అంటే ఉగాది ముందు రోజు సాయంత్రం రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. అలాగే బాలకృష్ణ - బోయపాటి BB3 టైటిల్ ఉగాదికి రావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఇక నాని టక్ జగదీశ్ టీం ఇప్పటికే ఈటివి, స్టార్ మా ఉగాది స్పెషల్ ప్రోగ్రాంలో సినిమాని ప్రోమోట్ చేసుకుంటున్నారు. ఇంకా ఆచార్య నుండి ఉగాది పోస్టర్, వెంకీ నారప్ప నుండి ఉగాది పోస్టర్ రావొచ్చని ఊహాగానాలున్నాయి. మరోపక్క బన్నీ పుష్ప టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంటే.. బన్నీ తగ్గేదే లే అంటున్నారు.

 అయితే ఇక్కడ ఫన్నీగా బన్నీ తగ్గేదే లే- ప్రభాస్ నిద్ర లే అంటూ రాధేశ్యామ్ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రాధేశ్యామ్ నిర్మాతలు యూవీ క్రియేషన్స్ తో ఆడుకుంటున్నారు. ఇవే కాకుండా చాలా సినిమాల ఫస్ట్  లుక్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఇవన్నీ ఉగాదికి తమ తమ లుక్స్ రిలీజ్ చేస్తూ పోటాపోటికి దిగెట్టే కనిపిస్తున్నాయి.

Ugadi Gifts 2021: Movies 1st Looks and Teasers:

Ugadi 2021: Movies 1st Looks and Teasers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs