Advertisement
Google Ads BL

ఇప్పుడేం చేస్తావ్ బన్నీ


దిల్ రాజు బ్యానర్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఐకాన్ చెయ్యబోతున్నట్టుగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ తో ప్రకటించాడు. అపుడప్పుడు ఐకాన్ టోపీ తో దర్శనమిస్తున్న అల్లు అర్జున్ ఐకాన్ మూవీ గురించి మాట్లాడింది లేదు.. సినిమా చేస్తున్నదీ.. లేనిది క్లారిటీ ఇచ్చింది లేదు. ఈ లోపు వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ డైరెక్షన్ చేసే ఛాన్స్ రావడంతో.. వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ స్క్రిప్ట్ తో బిజీ అయ్యాడు. అటు అల్లు అర్జున్ మాత్రం సుకుమార్ తో పుష్ప పాన్ ఇండియా మూవీకి సిద్దమైపోయాడు. ఓకె.. వకీల్ సాబ్ అయ్యాక వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ ఐకాన్ అంటాడేమో అనుకుంటే కొరటాల శివ తో మరో పాన్ ఇండియా మూవీ ప్రకటించాడు. దిల్ రాజు మాత్రం అల్లు అర్జున్ - వేణు శ్రీరామ్ తో ఐకాన్ ఉంటుంది అని చెబుతున్నాడు. ఒక్క అల్లు అర్జున్ సైడ్ నుండే ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెడుతున్నాడు. 

Advertisement
CJ Advs

వకీల్ సాబ్ హిట్ అయితే వేణు శ్రీరామ్ తో ఐకాన్ గురించి ఆలోచిద్దామనే ప్లాన్ లో అల్లు అర్జున్ ఉన్నాడనే టాక్ నడుస్తుంది. మరి ఇప్పుడు వకీల్ సాబ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ శుక్రవారం సోలో గా థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ సినిమా పవన్ క్రేజ్ తో కలెక్షన్స్ ధమాకా మోగిస్తుంది. వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ మేకింగ్ ని ప్రత్యేకంగా మెచ్చకుంటున్నారు. ఓ మై ఫ్రెండ్ తో ఫెయిల్యూర్ నీ, ఎమ్ సి ఏ తో ఎబోవ్ యావరేజ్ నీ చూసిన వేణు శ్రీరామ్ ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో బాగానే కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ నీ ఎట్ ఎ టైం డీల్ చెయ్యడం టఫ్ జాబ్ అయినప్పటికీ అటు స్టోరీలోని సోల్ చెడకుండా ఇటు పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వకుండా మ్యాగ్జిమమ్ ట్రై చేసాడు. 

పాన్ క్రేజ్, ఇమేజ్ తో వకీల్ సాబ్ ప్రస్తుతం కలెక్షన్స్ కొల్లగొట్టే పనిలో ఉంది. అటు క్రిటిక్స్ ఇటు ఆడియన్స్ వకీల్ సాబ్ కి ఫుల్ పాజిటివ్ టాక్ ఇవ్వడం, సోషల్ మీడియాలో వకీల్ సాబ్ సూపర్ అంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో వకీల్ సాబ్ కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డ్స్ నమోదు చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది. మరి వకీల్ సాబ్ హిట్ చూసిన బన్నీ ఐకాన్ మూవీ గురించి ఆలోచిస్తాడా? అసలే స్టైలిష్ స్టార్ నుండి ఐకానిక్ స్టార్ గా ప్రకటించుకున్న బన్నీ.. ఇప్పుడు వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేస్తాడా? లేదా? అనే క్యూరియాసిటిలో అల్లు అర్జున్ ఫాన్స్ ఉన్నారు.

Now what will you do Bunny:

Allu Arjun ICON back in news again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs