Advertisement
Google Ads BL

గ్లామర్ కన్నా పెరఫార్మెన్స్ కి స్కోప్ ఎక్కువ


గూఢచారి సినిమాలో అడివి శేష్ లవర్ గా గ్లామర్ డాల్ లా, టెర్రరిస్ట్ ఇంఫార్మెర్ గా కనిపించిన శోభితా ధూళిపాల.. అడివి శేష్ రీసెంట్ మూవీ మేజర్ లోనూ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈసారి గ్లామర్ కన్నా పెరఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న కేరెక్టర్ లో శోభితా ధూళిపాల కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

సాయి మంజ్రేకర్  క్యారెక్టర్ పోస్టర్‌తో  మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క హైస్కూల్ రొమాన్స్ లోకి ఒక స్నీక్ పీక్ ఇచ్చిన తరువాత ఆ అమరవీరుడి జీవితంలోని మరో ముఖ్య‌భాగాన్ని ఆవిష్కరించారు నిర్మాత‌లు. 26/11 ముంబై దాడుల్లో చిక్కుకున్న బందీ పాత్రలో శోభితా ధూళిపాల యొక్క  ఫ‌స్ట్ గిమ్స్‌ని విడుద‌ల‌చేశారు.

మొత్తం దేశాన్ని భయభ్రాంతులకు గురిచేసి ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపిన విపత్తు సంఘటన కారణంగా  శోభితా ధూళిపాల ఎదుర్కొన్న వేదనను ఈ పోస్టర్లో  చూపించారు.

26/11 దురదృష్టకర ఉగ్రవాద దాడుల సమయంలో హోటల్ తాజ్ వద్ద చిక్కుకున్న ఎన్ఆర్ఐ బందీ పాత్రలో  శోభితా ధూళిపాల నటించారు. ఈ పోస్టర్ ఈ చిత్రం యొక్క అతి ముఖ్యమైన సన్నివేశాలలో ఒకటి అని తెలుస్తోంది.

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది.  శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ చిత్రం యెక్క ముఖ్య ఉద్దేశం.

Makers of Major reveal the first glimpse of Sobhita Dhulipala :

Makers of Major reveal the first glimpse of Sobhita Dhulipala as the NRI hostage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs