Advertisement
Google Ads BL

హైదరాబాద్ కి రజినీ.. ఆందోళనలో ఫాన్స్


గత ఏడాది అన్నాత్తై షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చినప్పుడే.. టీం లో కొంతమంది కరోనా బారిన పడడం, తర్వాత రజినీకాంత్ హెల్త్ పాడై హాస్పిటల్ చేరాల్సి రావడమే కాదు.. అనారోగ్యం కారణముగా రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రాజకీయాల రంగ ప్రవేశం కోసం.. రజినీకాంత్ సినిమా షూటింగ్స్ త్వరగా చక్కబెట్టయ్యాలనే ఆత్రంతో.. హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో రజినీకాంత్ ఏకధాటిగా 14 గంటల పాటు షూటింగ్ లో పాల్గొనడం వలన ఆయన బాగా సిక్ అయ్యారు. అయితే కొన్నాళ్ళు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన రజినీకాంత్ మళ్ళి అన్నాత్తై షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం తమిళనాట 50 పర్సెంట్ అక్యుపెన్సీకి తో థియేటర్స్ నడపాలని, షూటింగ్స్ దగ్గర కఠిన నిబంధనలు పాటించాలంటూ తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రజిని మరోసారి హైదెరాబాదులో అడుగుపెట్టడం ఆయన అభిమానులని కలవర పెడుతుంది. కారణం ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న టైం లో మళ్ళీ షూటింగ్ అంటూ హైదరాబాద్ కి వచ్చిన సూపర్ స్టార్ మళ్లీ సేఫ్ గా చెన్నై వెళ్లాలంటూ ఆయన ఫాన్స్ పూజలు చేస్తున్నారు. కరోనా టైం లో రజినీకాంత్ షూటింగ్ లో పాల్గొనడం, అలాగే ప్రస్తుతం శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాత్తై షూటింగ్ స్పాట్ లో ఎప్పుడూ డాక్టర్స్ అవైలబుల్ ఉంటున్నారట. అయితే టీం కోసం డాక్టర్స్ ఉంటున్నారా? సూపర్ స్టార్ ఆరోగ్య రీత్యా డాక్టర్స్ అన్నాత్తై షూటింగ్ స్పాట్ లో ఉంటున్నారో తెలియదు కానీ.. అక్కడ అలా అందుబాటులో డాక్టర్స్ ఉండడం మంచిదే కదా అని సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నా రజిని ఇలా మరోసారి కరోనా టైం లో హైదరాబాద్ లో కాలు పెట్టడమే వాళ్ళకి నచ్చడం లేదు.

Rajinikanth leaves for Hyderabad for Annaatthe shoot:

Annaatthe shoot: Superstar Rajinikanth leaves for Hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs