Advertisement
Google Ads BL

ఈ ఏజ్ లో ఏంటీ అరాచకం


పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలి అనే 22 ఏళ్ళ కోరికని పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో తీర్చుకున్నాడు దిల్ రాజు. రాజకీయాల్లో బిజీగా ఉన్న టైం లోనే పవన్ వెంట పడి మరీ ఒప్పించిన దిల్ రాజు వకీల్ సాబ్ కోసం బాగానే ఖర్చు పెట్టాడు. పవన్ కోసం చార్టెడ్ ఫ్లైట్ కూడా పెట్టాడనే టాక్ గత ఏడాది వకీల్ సాబ్ మొదలైన కొత్తల్లో నడిచింది. ఏదైనా పాలిటిక్స్ తో బిజీగా ఉన్న టైం లో పవన్ తో సినిమా చేస్తే.. వెండితెరకు గ్యాప్ ఇచ్చిన పవన్ క్రేజ్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది దిల్ రాజు వేసిన లెక్కకు సరిపడా వకీల్ సాబ్ ప్రభంజనం నేడు థియేటర్స్ లో కనిపించింది. 

Advertisement
CJ Advs

నేడు వకీల్ సాబ్ విడుదలైన థియేటర్స్ దగ్గర పవన్ ఫాన్స్ కోలాహలం మాములుగా లేదు. అయితే పవన్ తో సినిమా చెయ్యాలనే కలను నెరవేర్చుకున్న దిల్ రాజు ఈ రోజు ఉదయమే వకీల్ సాబ్ థియేటర్ కి కొత్త భార్య తో కలిసి రావడమే కాదు.. పవన్ ఫ్యాన్ లా రెచ్చిపోయి వకీల్ సాబ్ లో పవన్ ఎంట్రీ ఇవ్వగానే పేపర్స్ చింపి ఎగరెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కూతురికి పెళ్లి చేసి మనవళ్లు పుట్టిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుని కుర్రాడిలా ఫోజులు కొడుతున్న దిల్ రాజు వకీల్ సాబ్ థియేటర్ లో ఇలా పేపర్స్ చింపి హంగామా చెయ్యడం చూసిన వారు ఈ వయసులో ఏమిటి అరాచకం అంటుంటే.. పెళ్లయ్యాక దిల్ రాజు స్టయిల్ మార్చి కుర్రాడిలా మారిపోయాడు.. అందుకే ఇలా అంటున్నారు ఆయన ఫాన్స్.

Dil Raju Enjoys Vakeel Saab In Theater:

Vakeel Saab: Dil Raju Tosses Papers; Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs