Advertisement
Google Ads BL

ఆదిపురుష్ హీరోయిన్ మూడు కోరికలు


తెలుగులో మహేష్, నాగ చైతన్య లతో నటించి.. టాలీవుడ్ కలిసిరాక బాలీవుడ్ కి చెక్కేసిన కృతి సనన్ అక్కడ సరైన అవకాశం కోసం ఎదురు చూసింది. కొన్నేళ్లుగా బాలీవుడ్ నే అంటిపెట్టుకుని ఉన్న కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తుంది. అందులో పాన్ ఇండియా మూవీ.. ప్రభాస్ ఆదిపురుష్ లో కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతుంది. అలాగే బచ్చన్ పాండే మూవీలోనూ కృతి సనన్ హీరోయిన్. అయితే కెరీర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే కృతి సనన్ అటు పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి.

Advertisement
CJ Advs

ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కృతి సనన్ ని మూడు కోరికలున్నాయట. అందులో.. 

మొదటిది: ఒక పెద్ద బంగ్లా.. అందులో అంతకన్నాపెద్ద గార్డెన్. ఆ గార్డెన్ లో సేద తీరుతూ ఉదయాన్నే టీ తాగుతూ రిలాక్స్ అవ్వాలనేది మొదటి కోరికట.

రెండవది: స్కై డైవింగ్. ఆ మాజాని ఆస్వాదించడటం రెండవ కోరికట.

మూడవది: జాతీయ స్థాయి పురస్కారం అందుకోవాలట. అంతేకాకుండా చరిత్రలో నిలిచిపోయిన ఓ గొప్ప వ్యక్తి బయోపిక్ లో నటించాలకనేది కృతి సనన్ మూడో కోరికట. 

ఈ మూడు కోరికలను తీర్చుకోవడానికి ఎంతగా కష్టపడాలో అంతగా కష్టపడతాను అంటుంది కృతి. ఆదిపురుష్, బచ్చన్ పాండే లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ కాకుండా.. మరో మూడు సినిమాలు కృతి సనన్ చేతిలో ఉన్నాయి. ఇలా ఆఫర్స్ తో బిజీగా ఉంటే.. కృతి కోరికలు నెరవేరడానికి ఎంతో సమయం పట్టదులే.. 

Kriti Sanon three desires:

Adipurush heroine Kriti Sanon three desires
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs