Advertisement
Google Ads BL

పూరి కెరీర్‌లోనే ఇలా ఎప్పుడూ జరిగి ఉండదు


ఆయన స్పీడ్ చూసి.. అందరూ ఆయనని డ్యాషింగ్ డైరెక్టర్ అంటారు. ఆయన తీసే సినిమాలు చూసి అందరూ ఆయనని డేరింగ్ డైరెక్టర్ అంటారు. కానీ ఆయన కెరియర్‌లోనే ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు.. ఓ సినిమా విషయంలో ఆయన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. ఎవరా డైరెక్టర్? ఏంటా సినిమా? అనేగా డౌటు. డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాధ్. సినిమా వచ్చేసి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘లైగర్’. ఈ సినిమా విషయంలో పూరి వెనక్కి తగ్గినట్లు.. ఏ సినిమా విషయంలో వెనక్కి తగ్గి ఉండడు. కారణం ఏమిటో అందరికీ తెలుసు. ఈ సినిమాని బలంగా వెనక్కి లాగుతున్నది మరెవరో కాదు.. కరోనానే. 

Advertisement
CJ Advs

 

ఈ సినిమాని ముంబై బ్యాక్ డ్రాప్‌లో తీయాలని పూరి ప్లాన్ చేశాడు. ఆఫ్ కోర్స్ ముంబై, గోవా బ్యాక్‌డ్రాప్ లేకుండా పూరి సినిమా తీయడం జరగదు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంతకు ముందు వరకు ముంబై బ్యాక్‌డ్రాప్‌నే వాడుకునే పూరి.. ఇప్పుడు ఏకంగా ముంబైలోనే నివాసం పెట్టేశాడు. తన కో ప్రొడ్యూసర్ ఛార్మితో కలిసి అక్కడే కథలు, కథలో మార్పులు మొదలెట్టాడు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. వీరు చేయాలనుకున్న ‘లైగర్’ సినిమా అసలు ఉంటుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. కరోనా లాక్‌డౌన్ అనంతరం ఎన్నో సినిమాలు చిత్రీకరణ జరుపుకుని, విడుదల కూడా అవుతున్నాయి. కానీ ‘లైగర్’ షూటింగ్ విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 

 

తీరా ఇప్పుడు షూటింగ్‌కి వెళదామనుకునే సమయానికి మరోసారి కరోనా సెకండ్ వేవ్.. ముంబై మహానగరాన్ని వణికిస్తోంది. మళ్లీ లాక్‌డౌన్ దిశగా అక్కడ పరిస్థితులు మారిపోయాయంటే.. ఇక షూటింగ్స్‌ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో.. పూరి విసిగిపోయి.. ముంబైని వదిలేసి మళ్లీ హైదరాబాద్ వచ్చేస్తున్నాడు. ఆయన ముంబైలో అడుగుపెట్టిన వేళా విశేషం ఏమంత బాగాలేదని ఫిక్స్ అయ్యాడనుకుంటా. తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్‌కి పయనమయ్యాడు. ఇక ‘లైగర్’ని కూడా హైదరాబాద్‌లోనే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాడంట. కాకపోతే.. ‘లైగర్’ హైదరాబాద్ వచ్చే సమయానికి అక్కడ కూడా పరిస్థితులు మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎలా చూసినా.. ‘లైగర్’ విషయంలో మాత్రం గట్టిగా ఏదో కొడుతుందని.. పూరి అభిమానులు పబ్లిక్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమా కొంతకాలం పక్కనెట్టి.. మరో సినిమా ఎత్తుకోమని.. ఉచిత సలహాలు కూడా పూరికి ఇస్తున్నారు.  

Corona Problems to Puri Ligar Movie:

Puri come back to Hyderabad with mumbai lockdown
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs