Advertisement
Google Ads BL

వకీల్ సాబ్: శృతి పాత్ర నిడివిపై అనుమానాలు


వకీల్ సాబ్ మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అంటూ పవన్ ఫాన్స్ ఇప్పటికే థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు. వకీల్ సాబ్ ప్రమోషన్స్ ని దిల్ రాజు అండ్ టీం ఓ రేంజ్ లో చేసారు. వకీల్ సాబ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ షో పవన్ ఫాన్స్ లో మరింత హుషారుని నింపింది. అంజలి, నివేత థామస్, అనన్య లు వకీల్ సాబ్ ని తెగ ప్రమోట్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టడమే కాదు.. అందులో ఆయనకి భార్య, ఓ సాంగ్ కూడా పెట్టారు. అందులో శృతి హాసన్ పవన్ భార్యగా నటించింది. అయితే శృతి హాసన్ - పవన్ ది సూపర్ హిట్ పెయిర్. గబ్బర్ సింగ్ మ్యాజిక్ మరోసారి రిపీట్ కాబోతుంది అని పవన్ ఫ్యాన్స్ కలలు కంటున్నారు.

Advertisement
CJ Advs

మరి అంతలాంటి పాపులారిటీ ఉన్న శృతి హాసన్ వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. కనీసం ఓ వీడియో బైట్ కూడా లేదు. శృతి హాసన్ కావాలనే వకీల్ సాబ్ ని అవాయిడ్ చేస్తుందా? అంటే శృతి హాసన్ పాత్ర నిడివి మరీ తక్కువా? ఓన్లీ సాంగ్, కొన్ని సీన్స్ కే శృతి ని పరిమితం చెయ్యడంతో ఆమె వకీల్ సాబ్ ఇంటర్వ్యూ ఎగ్గొట్టిందా? లేదంటే శృతి హాసన్ ని ఎంతగా దాచినా జస్ట్ ఓ ఇంటర్వ్యూ ఇప్పించడం పెద్ద విషయం కాదు. 

కానీ శృతి వకీల్ సాబ్ పై చిన్న కామెంట్ కూడా చెయ్యలేదంటేనే అందరిలో అనుమానాలు. జస్ట్ గెస్ట్ రోల్ చేసిన హీరోయిన్స్ కూడా తెగ హడావిడి చేస్తూ ఇంటర్వ్యూ లు ఇచ్చే కాలంలో శృతి వకీల్ సాబ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇలా ఎలా ఉంది. అందుకే వకీల్ సాబ్ లో శృతి పాత్ర నిడివిపై అనుమానాలు అనేది.

Pawan Kalyan and Shruti Haasan romance in Vakeel Saab:

Vakeel Saab release tomorrow 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs