కరోనా సెకండ్ ఉదృతి పెరిగిపోతుంది. కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా వీకెండ్ లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూస్ అమలు చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర లాంటి రాష్ట్రాలు లాక్ డౌన్ వలన ఆర్ధికవ్యవస్థ బాగా దెబ్బతిన్న కారణంగా మరోసారి లాక్ డౌన్ కానీ, కర్ఫ్యూ కానీ పెట్టే పరిస్థితి లేదని ప్రకటించాయి. మహా రాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూ పెడితే.. ఢిల్లీ, పూణే లాంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే తాజాగా నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎం లతో సమీక్ష నిర్వహించారు. కరోనా సెకండ్ వెవ్ ఉధృతి బాగా ఉన్న కారణంగా కరోనా టెస్ట్ లు పెంచాలని, వ్యాక్సిన్ కన్నా టెస్ట్ లకే ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ పిలుపునిచ్చారు.
కరోనా ఉధృతి పెరిగిపోతున్న కారణంగా మరోసారి మనం కఠిన పరిస్థితులని ఎదుర్కోబోతున్నామని, రాష్ట్రాలు స్వచ్ఛందంగా నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తే బావుంటుంది అని, నైట్ కర్ఫ్యూ లని కరోనా కర్ఫ్యూ అనే పేరుతొ పిలవాలన్నారు మోడీ. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలు, కంటోన్మెంట్ జోన్స్ లో ఆంక్షలు కఠినంగా అమలు చెయ్యాలని, కరోనా టెస్ట్ ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా కి ప్రజలు భయపడడం మానేశారని, అందరూ కరోనని లైట్ తీసుకోవద్దని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఏప్రిల్ 11 నుండి 14 వరకు కరోనా టీకా ఉత్సవ్ గా జరుపుకోవాలని మోడీ చెప్పారు.