Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ ని ప్రమోట్ చేస్తున్న అలియా భట్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫాన్స్ థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు. పెద్ద పెద్ద బ్యానెర్లు కట్టి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి స్వాగతం పలకడానికి రెడీ అయ్యారు. మరోకొద్ది గంటల్లో యుఎస్ ప్రీమియర్స్ మొదలైపోతాయి. ట్రేడ్ లోను, ఫాన్స్ లోను విపరీతమైన బజ్ ఉన్న వకీల్ సాబ్ వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. వకీల్ సాబ్ ట్రైలర్ తోనే కొత్త ట్రెండ్ సృష్టించారు పవన్ ఫాన్స్. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ ఉన్న వకీల్ సాబ్ కి బాలీవుడ్ నుండి విషెస్ మొదలైపోయాయి. అందులో ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్ అలియా భట్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని ప్రత్యేకంగా ప్రమోట్ చెయ్యడం ఆకట్టుకుంది.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ హీరోయిన్ గా ఆర్.ఆర్.ఆర్ లో సీత రోల్ ప్లే చేస్తున్న అలియా భట్ ప్రత్యేకంగా వకీల్ సాబ్ కి వెల్ కం చెప్పడం పవన్ ఫాన్స్ కి పట్టరాని సంతోషానిచ్చింది. అలియా భట్ ఓ వీడియో బైట్ ద్వారా వకీల్ సాబ్ కి విషెస్ తెలియజేసింది. నమస్కారం అంటూ చేతులు జోడిస్తూ.. నేను ఎంతో ఎగ్జైట్ అవుతున్నా.. పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ రేపు విడుదల కాబోతుంది.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, వకీల్ సాబ్ యూనిట్ కి ఆల్ ద బెస్ట్ అంటూ అలియా భట్ వీడియో బైట్ ని వదిలింది. ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్ అందులోనూ బాలీవుడ్ హీరోయిన్ అయిన అలియా భట్ వకీల్ సాబ్ సినిమా కి ఆల్ ద బెస్ట్ చెప్పడం తో పవన్ ఫాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అన్నట్టు రేపు వకీల్ సాబ్ విడుదలకాబోయే థియేటర్స్ లో అలియా భట్ - సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో బాలీవుడ్ లో తెరకెక్కిన గంగూబాయి కతియావాడీ తెలుగు టీజర్ ప్రదర్శించబడుతుంది.

Alia Bhatt special wishes to Pawan Kalyan Vakeel Saab Release:

Vakeel Saab Gets Wishes From Alia
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs