Advertisement
Google Ads BL

ఐకాన్ స్టార్: ఆ సినిమా చేయకపోతే చాలా.. బాగోదు!


అల్లు అర్జున్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్. ‘పుష్ప’ సినిమా నుంచి అల్లు అర్జున్ ముందు ఐకాన్ స్టార్ చేరబోతుంది. అల్రెడీ ‘పుష్ప’కు సంబంధించి జరిగిన ఫంక్షన్‌లో, వదిలిన టీజర్‌లో బన్నీని ఐకాన్ స్టార్‌గా ప్రకటించేశారు కూడా. మరి అలాంటి ‘ఐకాన్ స్టార్’.. ఆ సినిమా చేయకపోతే బాగుంటుందా? చాలా.. బాగోదు. ఇంతకీ ఏం సినిమా అది అనుకుంటున్నారా? ‘ఐకాన్’. ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ‘ఐకాన్’ అనే చిత్రాన్ని బన్నీ హీరోగా ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల తర్వాత ఈ సినిమాపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పుడు వేణు శ్రీరామ్ చేసిన ‘వకీల్ సాబ్’ కనుక బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే.. మళ్లీ ‘ఐకాన్’పై చర్చలు మొదలవ్వడం ఖాయం. అయితే అంతకు ముందే ‘ఐకాన్’ గురించి మాట్లాడుకునేలా చేశాడు బన్నీ. తనని ఇకపై ‘ఐకాన్ స్టార్’ అని పిలవాలి అని ప్రకటించుకుని.. మరోసారి వేణు శ్రీరామ్ ‘ఐకాన్’కు రెక్కలొచ్చేలా చేశాడు. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడీ ఐకాన్ స్టార్.. ఆ సినిమా చేస్తాడా? లేదా? అనే దానిపై బన్నీ సైడ్ నుంచి ఎటువంటి అప్‌డేట్ లేదు కానీ, దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు మాత్రం ఖచ్చితంగా బన్నీతో ‘ఐకాన్’ చిత్రం ఉంటుందని ఢంకా బజాయిస్తున్నారు. ‘వకీల్ సాబ్’కు సంబంధించి జరిగిన ప్రతి ఇంటర్వ్యూలో వారు బన్నీ ‘ఐకాన్’ ప్రస్తావనను తీసుకువచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్‌పైకి వెళుతుందని, ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ బన్నీ వరుస చూస్తుంటే.. పేరుకు ముందు మాత్రమే ఉండాలనుకుంటున్నాడు తప్ప.. ఆ పేరు కలిగిన సినిమాలో చేయాలని ఏ కోశానా బన్నీలో కోరిక లేదు. ఇప్పుడంతా పాన్ ఇండియా గేమ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ గేమ్‌లో బన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలని భావిస్తున్నాడు. ‘ఐకాన్’ అందుకు సరిపోదని భావిస్తున్నాడు కాబట్టే.. ‘ఆచార్య’ డైరెక్టర్‌తో నెక్ట్స్ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా బన్నీ మనసులో ‘ఐకాన్’ ఉన్నట్లు అయితే ఏం కనబడటం లేదు. కానీ ‘ఐకాన్ స్టార్’కి పర్ఫెక్ట్ న్యాయం జరగాలంటే.. ‘ఐకాన్’తో బంపర్ హిట్ కొట్టి చూపించాలని బన్నీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

Again News on Allu Arjun Icon Movie:

Dil Raju and Venu Sriram confirmed Icon with Bunny
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs