Advertisement
Google Ads BL

పుష్ప టీజర్ పై చిరు ట్వీట్ వైరల్


సుకుమార్ ద్దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప టీజర్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే అంటే నిన్న నైట్ విడుదల చేసారు. పుష్ప పాన్ ఇండియా టీజర్ కి విశేషమైన స్పందన రావడమే కాదు.. ఇప్పటికి పుష్ప టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ చెప్పిన  పవర్ ఫుల్ డైలాగ్ చూసి కాదు సినిమా నిజంగా తగ్గేదే లే అన్నట్టుగా ఉంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. మేనల్లుడి కి విషెస్ చెబుతూ..  

Advertisement
CJ Advs

#Pushpa టీజర్ చూసాను. చాలా రియలిస్టిక్ గా rustic గా ఉంది. పుష్పరాజ్ గా @alluarjun తగ్గేదేలే !!! Happy Birthday My Dear Bunny! అంటూ విషెస్ చెప్పడం వైరల్ అయ్యింది. చిరు చెప్పడం కాదు.. అల్లు అర్జున్ పుష్ప టీజర్ లో మాస్ మేకోవర్‌తో అదరగొట్టేసాడు. లారీ డ్రైవర్ గా, ఎర్ర చందనం దుంగలను నరికే కూలీగా, పోలీస్ లతో తలపడే పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. ఇక అల్లు అర్జున్ తగ్గేదే లే అని చెప్పిన ఒకే ఒక్క పవర్ ఫుల్ డైలాగ్ అందరికి తెగ నచ్చేయ్యడమే కాదు.. ఆ డైలాగ్ అల్లు అర్జున్ కి ఎంతో ఇష్టమైనదట. అదే విషయాన్ని గత రాత్రి జరిగిన పుష్ప ఫస్ట్ మీట్ లో చెప్పాడు బన్నీ.

Chiru tweet on Pushpa teaser going viral :

Chiru tweet on Pushpa teaser going viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs