Advertisement
Google Ads BL

వచ్చే ఈద్ కి జంప్ అవుతున్న సల్మాన్


బాలీవుడ్ భాయీజాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి రంజాన్ పండగ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికి తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా ఈద్ రోజున తన సినిమాలని రిలీజ్ చేస్తూ బాక్సాఫీసుని షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ ఈ ఏడాది ఈద్ నాటికీ తన రీసెంట్ మూవీ రాధే ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించాడు. సల్మాన్ ఈద్ కి వస్తాడని తెలిసి చాలామంది బాలీవుడ్ హీరోలు తమ సినిమాలను ఈద్ కి లేకుండా డేట్ లు సెట్ చేసుకుంటారు. ఈద్ కి తన సినిమాలను రిలీజ్ చేసి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతుంటాడు సల్మాన్. 

Advertisement
CJ Advs

ఈ ఏడాది రాధే సినిమాతో రంజాన్ కి బాక్సులు బద్దలవుతాయనుకుంటే.. సల్మాన్ ఖాన్ వచ్చే ఈద్ కి సినిమాని పోస్ట్ పోన్ చెయ్యబోతున్నట్టుగా కబీర్ బేడీతో జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పడం ఫాన్స్ కి షాకిచ్చింది. రాధే సినిమాని అనుకున్న టైం కే విడుదలకు గట్టిగా ప్లాన్ చేస్తున్నామని, కానీ కరోనా కేసులు ఉధృతి ఇలానే కొనసాగి లాక్ డౌన్ పెడితే గనక సినిమాని వచ్చే ఈద్ కి వాయిదా వేస్తామని చెప్పడంతో ఫాన్స్ అల్లాడిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గాలంటే ప్రజలు మాస్క్ పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నిభందనలు పాటిస్తే అనుకున్న టైం కే సినిమాని విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు సల్మాన్. 

కరోనా కేసులు పెరగడం వలన లాక్ డౌన్ తదుపరి థియేటర్స్ యాజమాన్యాలు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారని, అన్ని జాగ్రత్తలతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావాలంటూ సల్మాన్ పిలుపునిచ్చారు.

Salman Khan Radhe Postponed:

Salman Khan says Radhe might be postponed to Eid 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs